Producers : ఈ స్టార్ హీరోలు లేకపోతే ఈ ప్రొడ్యూసర్స్ ఇప్పటికే తట్టబుట్ట సర్డుకునేవారా..?

సినిమా పేరు చెబితే ప్రతి ఒక్కరు మన స్టార్ హీరోల గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి ఆ సినిమాని ముందుకు తీసుకురావడానికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ దాని వెనకాల ఎన్ని కష్టాలు పడతారనే విషయం ఎవ్వరికీ తెలియదు...

Written By: Gopi, Updated On : October 8, 2024 5:14 pm

Producers

Follow us on

Producers : సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సినిమా ద్వారా భారీ లాభాలను అర్ధించాలనే ఉద్దేశ్యంతోనే ప్రొడ్యూసర్స్ ఇందులో భారీగా పెట్టుబడులను పెడుతున్నారు. నిజానికి సినిమా అంటే ప్రతి ఒక్కరు చాలా ప్యాషన్ గా ఉండి మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా సినిమాలు చేయాలని చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది నిర్మాతలు వరుస సినిమాలను చేస్తూ భారీగా నష్టాన్ని కూడా చవిచూస్తున్నారు. అలాంటి వారు ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇక జీవితాన్ని కోల్పోతారు అనుకున్న సందర్భంలో కొంతమంది హీరోలు వాళ్లకి చేయూతనిచ్చి మంచి విజయాలను సాధించి పెట్టారు. మరి ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు, వాళ్లకు సపోర్ట్ ను ఇఛి ఇండస్ట్రీ లో నిలబెట్టిన హీరోలు ఎవరనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక నందమూరి ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించిన కళ్యాణ్ రామ్ బ్యానర్ లో వరుసగా చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. తను హీరోగా చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించినప్పటికీ మిగతా హీరోలను పెట్టి తీసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్ 2’ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ కి చాలా నష్టాలైతే వచ్చాయి.

ఇక తను చాలా వరకు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు తన తమ్ముడు అయిన జూనియర్ ఎన్టీఆర్ తను చేసిన ‘జై లవకుశ’ అనే సినిమాకి నందమూరి కళ్యాణ్ రామ్ ను ప్రొడ్యూసర్ గా ఎంచుకున్నాడు. దాని ద్వారా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా కళ్యాణ్ రామ్ కి భారీ లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక దాంతో ఆయన ఒక్కసారిగా తనకున్న అప్పులను మొత్తం కట్టేసుకొని ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన దేవర సినిమాకి కూడా తనే ప్రొడ్యూసర్ కావడం విశేషం…

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూడా బండ్ల గణేష్ ని ప్రొడ్యూసర్ గా మార్చి తీన్మార్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో బండ్ల గణేష్ ఒకసారి డైలమాలో పడిపోయాడు. మరి అప్పుడు తను ఏం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పిలిచి ‘గబ్బర్ సింగ్’ సినిమాని చేసుకోమని మరొక అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడమే కాకుండా అప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచి భారీ ప్రాఫిట్స్ ను కూడా తీసుకొచ్చింది…