https://oktelugu.com/

Prashant Verma : జై హనుమాన్ లో రిషబ్ శెట్టి ని హనుమంతుడిగా తీసుకొని ప్రశాంత్ వర్మ తప్పచేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఇప్పుడిప్పుడే వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి ఇన్స్పిరేషన్ తో మరి కొంతమంది దర్శకులుగా మారి సక్సెస్ లను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నారు...ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సినిమాను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు సైతం పెను సంచలనాలను సృష్టిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 12:35 PM IST

    Prashant Verma

    Follow us on

    Prashant Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనను తను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ…ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వైవిధ్యభరితమైన కథాంశాలతో తెరకెక్కుతూ ఉండటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటున్న ఈ దర్శకుడు హనుమాన్ సినిమాకి సీక్వేల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడనే విషయం పైన ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక దాంతోపాటుగా ఆయన మంచి నటుడు కావడం వల్లే ప్రశాంత్ వర్మ అతనిని సినిమాల్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇదే విషయం పైన కొంతమంది కొన్ని రకాల విమర్శలను కూడా చేస్తున్నారు. అది ఏంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఉన్నప్పటికి ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ సినిమా కోసం కన్నడ నటుడిని ఎందుకు తీసుకున్నారు. ఆయన మెన్స్ హీరోలకంటే తోపు హీరోనా? అంటూ కొన్ని విమర్శలైతే చేస్తున్నారు.

    ఇక దాంతోపాటుగా ప్రశాంత్ వర్మ కూడా రిషబ్ శెట్టిని తీసుకోకుండా వేరే తెలుగు హీరోని తీసుకుంటే బాగుండేది అని ఇప్పుడు రిషబ్ శెట్టి రియాలైజ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ కూడా తనదైన రీతిలో ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. అలాగే రిషబ్ శెట్టి మరొకసారి తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

    ఇక ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా?

    లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ప్రశాంత వర్మ పేరు పాన్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో వినిపిస్తుందనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…