https://oktelugu.com/

Junior NTR-Prasanth Neel : ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం వేస్ట్ అంటున్న ట్రేడ్ పండితులు…కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీయార్ ఒకరు...ప్రస్తుతం ఆయన భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 01:10 PM IST

    Junior NTR-Prasanth Neel

    Follow us on

    Junior NTR-Prasanth Neel :  సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించి పెట్టడంలో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలతో ఆయన తనకంటూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా కూడా ఎలివేట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం చాలా వీక్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం 300 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబతట్టింది. ఇక దాంతో ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన వార్ 2 సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా ఆయన కథ మాటలు అందించిన బఘీర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ చాలా వరకు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది సినీ మేధావులు సైతం ఎన్టీఆర్ ని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ప్రశాంత్ నీల్ ఎప్పుడూ అదే రొటీన్ సినిమాలను చేస్తున్నాడు. డార్క్ షెడ్ లో ఉండే సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకున్నాడు.

    మరి ఎప్పుడు అవే సినిమాలు చేయడం వల్ల అవి ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. దానివల్ల ఆయన మార్కెట్ అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసే సినిమా కూడా డార్క్ మోడ్ లో ఉండబోతుంది ఆయన సినిమాలన్నీ రొటీన్ గా మారబోతున్నాయి.

    కాబట్టి ఎన్టీఆర్ అతనితో సినిమా చేయకుండా ఉంటేనే బెటర్ అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు… చూడాలి మరి ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఎన్టీఆర్ ను ఏ రేంజ్ హీరోగా నిలబెడుతాడు అనేది…