Kajal : నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈమెకు మంచి హిట్ లేదు. స్టార్ హీరోయిన్ అనే పేరు కూడా లేదు. ఈ బ్యూటీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చింది. అయినా సరే ఇక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ ను సాధించలేదు నిధి. అయితే ఈ బ్యూటీకి లక్ పరీక్షించుకోవడానికి చాలా అవకాశాలు వచ్చాయి. యంగ్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. కానీ ఎందుకో ఒక్క హిట్ కూడా పడలేదు. అవకాశాలు ఉన్నా సరే హిట్ లు లేకపోవడం అభిమానులను బాధ పెట్టిందనే చెప్పవచ్చు.
నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమాతో ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వచ్చింది. అయినా సరే అభిమానులను మెప్పించడంలో విఫలం అయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ నటించిన మజ్ను సినిమాలో కూడా మెరిసింది. అయితే వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది.
మొత్తం మీద హిట్ లు పడటం లేదనో ఏంటి కానీ గ్లామర్ కు పెట్టిన పులిస్టాప్ లను తుడిచి పెట్టినట్టు ఉంది ఈ బ్యూటీ. అందుకే రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి హిట్ ను సంపాదించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అభిమానులు కూడా మెచ్చారు. దీంతో ఈ సినిమా తర్వాత ఇక నిధికి అసలు తిరుగు లేదు అనుకున్నారు. చాలా బిజీ అవుతుంది అనుకున్నారు అభిమానులు. కానీ అదృష్టం అడ్డం తిరిగినట్టు ఈమెకు ఊహించిన రేంజ్ లో ఆఫర్లు రాలేదు. హిట్లు పడలేదు. దీంతో తమిళ్ వైపు తొంగి చూసింది నిధి. అయినా సరే అక్కడ కూడా చుక్కెదురైంది. పెద్దగా హిట్ పడలేదు. స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ ను పొందలేదు నిధి.
అన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీదనే హోప్స్ పెంచుకుంది నిధి. ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా నిధి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తెలుగులో సినిమాలు చేసే హీరోయిన్ లు తెలుగు నేర్చుకోరు అంటూ కామెంట్లు చేసింది. అంతేకాదు కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ ను మాత్రం నేను కాదు అంటూ కామెంట్లు చేసింది నిధి. ఇక ఈ బ్యూటీ కాజల్ అగర్వాల్ ను ఉద్దేశించి కామెంట్లు చేసింది అంటున్నారు కొందరు. దీనికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే కాజల్ కు పెద్దగా తెలుగు రాదు, ఆమె కూడా అందరికీ నమస్కారం అంటుంది అని కాజల్ అభిమానులు తెగ సీరియస్ అయ్యారు. ఈ రచ్చ పెరిగేలా ఉంది అనుకుంది కావచ్చు నిధి ఈ విషయం మీద ఓ క్లారిటీ ఇచ్చేసింది. తను కాజల్ ను అనలేదు అని కేవలం తన గురించి మాత్రమే తాను చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది.