Rishab Shetty : కంటెంట్ ఉంటే చాలు టాలీవుడ్ ఏ సినిమాను అయినా సరే ఆదరిస్తుంది. అంతేనా సూపర్ హిట్ ను కూడా అందిస్తుంది. ఇలా మంచి కంటెంట్ తో వచ్చిన చాలా సినిమాలు టాలీవుడ్ లో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కింగ్ గా కూడా నిలిచాయి. ఇతర ఇండస్ట్రీల సినిమాలు టాలీవుడ్ లో హిట్ అవుతాయి కాబట్టి చాలా మంది టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కన్నడ, తమిళ్, మలయాళ వంటి ఇండస్ట్రీల సినిమాలు తెలుగులో రిలీజై మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇలాంటి సినిమాల్లో కాంతార ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతో మందికి నచ్చింది. థియేటర్ లలో చూసిన వారికి గూస్ బాంబ్స్ వచ్చాయి. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందంటూ తెగ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
హీరోనే దర్శకత్వం వహించి ఈ సినిమాకు ఇప్పటికీ కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించారు హీరో రిషబ్ శెట్టి. అదేనండీ కాంతార సినిమా గురించి మనం మాట్లాడుకుంటుంది. ఇక ఈ హీరోకు కాంతార విజయంతో వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాదు కాంతార 2 కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. తన ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించే సినిమాలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఇక హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో కూడా ఈ స్టార్ హీరో కనిపించనున్నాడు. ఇవి మాత్రమే కాదు మరో సినిమాలో కూడా నటించడానికి ఈ స్టార్ హీరోకు అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో టాక్. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఈ స్టార్ హీరో ప్రధాన పాత్ర పోషించబోతున్నారట. ఇక హనుమాన్ సినిమాలో అయితే హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు ఈ హీరో. సినిమా నుంచి వచ్చిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొత్తం మీద హనుమాన్ పాత్రలో మాత్రం సూపర్ గా కనిపించారు. అయితే సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. కానీ రీసెంట్ గా ఈయన మీద కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్ ను చూసి ఆయన రూపురేఖలు బాగాలేవని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం రిషబ్ శెట్టి రూపు రేఖలు పూర్తిగా మారిపోయారు. పొడవాటి జుట్టుతో కనిపించారు రిషబ్. అయితే ఈ లుక్ కాంతార 2 కోసమా? లేదా హనుమాన్ కోసమా? అనే విషయం మీద క్లారిటీ లేదు. మొత్తం మీద ఈ కొత్త లుక్ మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది.