Pallavi Prashanth
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ‘ నేను కనుక టైటిల్ గెలిస్తే వచ్చిన డబ్బంతా రైతులకే ఖర్చు పెడతానంటూ చాలా సార్లు చెప్పాడు. ఊహించిన విధంగానే రైతు బిడ్డ టైటిల్ కొట్టాడు. వచ్చిన 35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రైతుల కోసమే ఖర్చు చేస్తానని, స్టేజిపై మాటిచ్చాడు. ఇంతవరకు బానే ఉన్నా ..ఆ తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమానుల చేసిన అల్లర్లకు ప్రశాంత్ జైలు పాలు అయ్యాడు.
ప్రస్తుతం బెయిల్ పై వచ్చిన ప్రశాంత్ స్పై బ్యాచ్ తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత ప్రశాంత్ నన్ను సీఎం ని చేస్తే మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 గ్రామాల ప్రజలను ఆదుకుంటా అంటూ ప్రశాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటూ తాను తప్పు మాట్లాడలేదన్నాడు ప్రశాంత్.
తాజా ఇంటర్వ్యూ లో ప్రశాంత్ మాట్లాడుతూ .. అవును .. నేను సీఎం ని చేయండన్నాను .. ఎందుకు అన్నానంటే .. ఓ రిపోర్టర్ అన్న వచ్చి మీ పక్కనే 14 గ్రామాలు ఉన్నాయి కదా .. ఆ గ్రామాలకు ఎం చేస్తావ్ అన్నారు. నాకు వచ్చిందే 35 లక్షలు. అవి 14 ఊళ్లకు సాయం చేయడానికి ఏం సరిపోతాయి. అదేమైనా ఫలహారమా కొంచెం కొంచెం పంచడానికి. అందుకే ఆ డబ్బులు సరిపోవు కాబట్టి నన్ను సీఎంని చేయండి. ఆ గ్రామాలను ఆదుకుంటానని అన్నాను. కానీ దాన్ని కూడా ట్రోల్ చేశారు.
గుండెలపై చేయి వేసుకుని చెప్తున్నా .. నాకు వచ్చిన 35 లక్షల్లో ప్రతి ఒక్క రూపాయి రైతులకే ఇస్తా .. నేను బిగ్ బాస్ హౌస్ లోకి నా కోసం పోలేదు .. నేను అప్పుడు చెప్పా .. ఇప్పుడు చెప్తున్నా .. నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా .. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఈ జన్మ ఎత్తిందే రైతుల కోసం. నాకు వచ్చిన 35 లక్షలు రైతులకు పంచుతానని నాగార్జున సార్ కి మాటిచ్చినా .. కచ్చితంగా పంచుతాను. నేను ఏ గేమ్ లో నైనా ఓడిపోతే బాధపడింది నా కోసం కాదు. నేను జనాల కోసమే పోయాను వాళ్లకే ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.