NTR: జూ. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలు అన్ని కూడా మంచి సక్సెస్ లను సాధిస్తుంటాయి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు జూ. ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు జూ. ఎన్టీఆర్.
తన డాన్స్, నటన, మాటలు, పాటలతో ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లో కూడా భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. డైలాగ్స్ అయినా డాన్స్ అయినా ఆయనకు ఆయనే సాటి. పోటి. సింగర్ గా కూడా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న జూ. ఎన్టీఆర్ పలు సినిమాలలో అద్భుతంగా పాటలు పాడారు. అయితే తారక్ తన సినిమాలలో ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారట. నమ్మలేకపోతున్నారా? అంటే ఎన్టీఆర్ కొరియోగ్రఫర్ అయ్యారు అన్నమాట.
జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన రభస సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలోని ఒక సాంగ్ కు ఎన్టీఆర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఒక డాన్స్ కోసం అదిరిపోయే స్టెప్స్ ఉండాలని.. ఆయనే స్వయంగా కంపోజ్ చేశారట. కానీ ఎన్టీఆర్ గొప్పతనం ఏంటంటే.. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసినా కూడా క్రెడిట్స్ మాత్రం తీసుకోలేదట. ఈయన హిడెన్ టాలెంట్ గురించి తెలిసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది నిజమా అంటూ షాక్ అవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ స్టార్ హీరో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి. భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది.