https://oktelugu.com/

Racha: రచ్చ సినిమా షూటింగ్ లో తమన్నా రామ్ చరణ్ ను డామినేట్ ఎందుకు చేసింది?

రామ్ చరణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆయన వరుసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించారు రామ్ చరణ్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 2, 2024 / 10:32 AM IST
    Follow us on

    Racha: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది. ఈ హవా ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ సత్తా చూపిస్తూ ముందుకు కదులుతుంటే.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా తన స్థాయిని విస్తరించుకుంటూ ముందుకువెళ్తున్నాడు. ఇలా ఎందరో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నారు. కానీ కొందరు స్టాటింగ్ లో సమస్యలను ఎదుర్కొన్నారు.

    అయితే రామ్ చరణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆయన వరుసగా మంచి సక్సెస్ లను సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించారు రామ్ చరణ్. అయితే ఈయనకు ఆరెంజ్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సంపాదించింది. ఈ సినిమా ఫ్లాన్ తర్వాత హిట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే తరుణంలో సంపత్ నంది డైరెక్షన్ లో రచ్చ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో తమన్నా రామ్ చరణ్ కు దూరంగా ఉందట..

    రచ్చ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా కొన్ని విషయాల్లో రామ్ చరణ్ ను డామినేట్ చేసేదట. ముఖ్యంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు రిహార్సల్స్ రామ్ చరణ్ తో పాటు చేయకుండా తను వేరే సపరేట్ గా ప్రాక్టీస్ చేసేదట. రామ్ చరణ్ కూడా అవేం పట్టించుకోకుండా తన డ్యాన్స్ తను చేస్తూ ముందుకు సాగేవాడట. అయితే ఒకరోజు షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాత రామ్ చరణ్ తో కలిసి చాలా బాగా మాట్లాడుతూ షూటింగ్ రిహార్సల్స్ కూడా చేసేదట. అయితే ముందు రోజు అలా ఎందుకు చేసింది అంటే..చిరంజీవి కొడుకు అని దూరంగా ఉందట.

    చిరంజీవి కొడుకు అని దూరంగా ఉందట.. కానీ ఆమె అలా ఉండడాన్ని చూసి రామ్ చరణ్ ను డామినేట్ చేస్తున్నట్టుగా కనిపించేసరికి తను అలా చేయకూడదని మళ్లీ రామ్ చరణ్ తో కలిసి మాట్లాడి అతనితోపాటు చనువుగా ఉంటూ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిందట. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ కి తమన్నా మంచి ఫ్రెండ్ గా మారిపోయింది.