Devara Movie: దేవర మూవీని కొరటాల శివ అలా డిజైన్ చేశాడా? మరో కెజిఎఫ్ 2 అవుతుందా?

ఆచార్య 2022లో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య విషయంలో కొరటాల శివపై చిరంజీవి పరోక్షంగా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా కొరటాల శివ నష్టపోయాడు.

Written By: S Reddy, Updated On : May 25, 2024 10:35 am

Did Koratala Siva design Devara movie like that

Follow us on

Devara Movie: దేవర మూవీ అటు ఎన్టీఆర్ కి ఇటు కొరటాల శివకు చాలా ప్రతిష్టాత్మకం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఖచ్చితంగా మార్క్ చూపించాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళి కావడంతో ఆయన ఇమేజ్ తోనే ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఆడిందనే వాదన ఉంది. కాబట్టి సోలోగా ఎన్టీఆర్ నార్త్ లో తానేమిటో నిరూపించుకోవడానికి దేవర సక్సెస్ అవసరం. మరోవైపు దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రంతో అబాసుపాలయ్యాడు.

ఆచార్య 2022లో విడుదలై అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య విషయంలో కొరటాల శివపై చిరంజీవి పరోక్షంగా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా కూడా కొరటాల శివ నష్టపోయాడు. అపజయం లేని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ ట్రాక్ ని ఆచార్య దెబ్బ తీసింది. కాబట్టి దేవరతో ఆయన కమ్ బ్యాక్ కావాలని గట్టిగా కోరుకుంటున్నాడు.

కాగా ఆచార్య ప్రోమోలు, పోస్టర్స్ చూస్తుంటే ఆయన అవుట్ అండ్ అవుట్ సీరియస్ నోట్ లో దేవర చిత్రాన్ని డిజైన్ చేశారని అర్థం అవుతుంది. ఇటీవల విడుదలైన ఫియర్ సాంగ్ కూడా ఇదే సూచిస్తుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ పూర్తిగా ఫెరోషియస్ అండ్ సీరియస్ గా సాగుతుందని సమాచారం. ఒక లక్ష్యం కోసం ముందుకు సాగే హీరో క్యారెక్టర్ లో ఎలాంటి ఫన్ ఎలిమెంట్స్ ఉండవు. ఎన్టీఆర్ లుక్, ఎక్సప్రెషన్స్ చాలా సీరియస్ గా ఉంటాయని అంటున్నారు.

కెజిఎఫ్ 2లో హీరో యష్, పుష్ప లో అల్లు అర్జున్, సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్ తలపించేలా దేవర లో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? అంటే… ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా మరో పాత్రలో ప్రేక్షకులు కోరుకునే కామెడీ, సాంగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట. కాగా దేవర మూవీలో తన పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని జాన్వీ కపూర్ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఫుల్ మీల్ వంటి సినిమాను కొరటాల సిద్ధం చేస్తున్నారు అనిపిస్తుంది.