Samantha- Naga Chaitanya: వయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంతను పలువురు వివిధ మార్గాల్లో పరామర్శిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓ మోటీవేషన్ మెసేజ్ తో సమంతలో ధైర్యం నింపారు. కొందరు నేరుగా సమంతను కలిసి ఆమె క్షేమ సమచారాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ కూడా సమంతకు వచ్చిన వ్యాధిపై స్పందించారు. ఆమె మాజీ మరిది, హీరో అఖిల్ సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టాడు. ఆ తరువాత నాగార్జున కూడా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో అసలు సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య ఆమెను కలిశాడా..? అని చర్చ సాగింది. కానీ చైతూ సీక్రెట్ గా వెళ్లి సమంతను పరామర్శించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

‘ఏమాయ చేశావె’ సినిమాతో నాగచైతన్య, సమంతలు ప్రేమలో పడ్డారు.. ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లపాటు కలిసున్న వీరు కొన్ని నెలల కిందట విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరు ఎదురెరుదురుగా కలుసుకోలేదు. నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లోనూ బిజీ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. అయితే ఒక్కసారిగా అందరూ షాక్ తినేలా తనకు ‘వయోసిటీస్’ వ్యాధి ఉన్నట్లు చెప్పడంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
ఆమె తనకున్న వ్యాధి గురించి సోషల్ మీడియాలో చెప్పగానే పరామర్శలు వెల్లువెత్తాయి. సినిమా ప్రముఖ నటులతో పాటు అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ సమంతను పరామర్శించిందా..? అని అనుకునే లోపే అఖిల్ వెంటనే స్పందించారు. అటు నాగార్జున నేరుగా కలుస్తారని అన్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కానీ ప్రస్తుతం నాగచైతన్య ఆసుపత్రికి వెళ్లి సమంతను కలిశారని అంటున్నారు.

ఈరోజుల్లో ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా కంటపడిపోతుంది. ఎవరు ఏం చేసినా దానిని వీడియో రూపంలో చిత్రీకరించి నెట్టింట్లో పెడుతున్నారు. అయితే నాగచైతన్య సమంతను కలిశారని అంటున్నారు. కానీ అందుకు సంబంధించిన ఎటువంటి ఆధారం లేదని అంటున్నారు. ఒకవేళ సమంతను విజిట్ చేసినా రిజిస్టర్ లో సైన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వివరాలు కూడా లేకపోవడంతో అసలు నిజంగానే నాగచైతన్య సమంతను కలిశాడా..? అనే చర్చలు సాగుతున్నాయి.