https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి చేసిన ఆ మిస్టేక్స్ వల్లే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ప్లాప్ అయిందా..?

తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవికి ఉన్న గుర్తింపు వేరే హీరోకి లేదనే చెప్పాలి. ఆయన సాధించిన విజయాల ముందు ప్రస్తుతం ఉన్న హీరోలు ఎందుకు పని చేయరని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : August 23, 2024 / 12:51 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత దాదాపు 40 సంవత్సరాలుగా ఏలుతున్న ఒకే ఒక్క స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి… ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్ర అయితే ఉంటుంది. అందుకే ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి మాస్ హీరో క్లాస్ సినిమాలకు సెట్ అవ్వడు అంటూ కొన్ని కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ చిరంజీవి వాటిని పట్టించుకోకుండా క్లాస్ సినిమాలు చేసి సక్సెస్ లను అందుకున్నాడు…ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా హీరోల నుంచి డామినేషన్స్ ఎదురైనా తను ఏది పట్టించుకోకుండా చిత్తశుద్ధితో చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగాడు. నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అందరి అదృష్టమనే చెప్పాలి. ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది కూడా వాస్తవం…

    ఎన్నో వైవిధ్యమైన పాత్రలని పోషిస్తూ ఆ పాత్రలకు ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి చిరంజీవి…చిరంజీవి చేసిన ఒక సినిమా ఆయన చేసిన ఒక మిస్టేక్ వల్లే ఫ్లాప్ అయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి ఆ సినిమాలో కనక ఎలాంటి మిస్టేక్ లు చేయకుండా ఉండుంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ గా మారేది.

    ఇక ఆ సినిమా ఏంటి అంటే తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాసు డైరెక్షన్ లో తెరకెక్కిన స్టాలిన్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండటమే కాకుండా ఒక సోషల్ మెసేజ్ తో కూడా ఈ సినిమా నడుస్తుంది. అయినప్పటికీ ప్రేక్షకులను సినిమాకి పెద్దగా కనెక్ట్ అయితే చేయలేకపోయింది. దానికి కారణం ఏంటి అంటే? సినిమా ఎంతసేపు మనం ముగ్గురికి హెల్ప్ చేసి వాళ్ళని మరొక ముగ్గురికి హెల్ప్ చేయాలని చెబుతూ ఉంటారు. ఆ హెల్ప్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది మన కండ్లకు కట్టినట్టుగా చూపించడం లో ఫెయిల్ అయ్యారు. దానివల్లే ఈ సినిమా సెకండాఫ్ అంతా చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది.

    ఇంకా చిరంజీవి కూడా ఈ సినిమా కోసం తన ఇమేజ్ ని పక్కన పెట్టి కొన్ని రియలేస్టిక్ గా ఉండే సీన్లలో నటించి ఉంటే బాగుండేది. ఆయన తన ఇమేజ్ ను చూసుకుంటూనే సోషల్ మెసేజ్ పబ్లిక్ లోకి రీచ్ అవ్వాలని కోరుకున్నారు. కాబట్టే ఆ సినిమా 100% పూర్తి ఎఫర్ట్స్ తో రాలేదు. దాని వల్లే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. లేకపోతే చిరంజీవి ఈ సినిమాని ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టుగా మలిచేవాడు. నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరోని అప్పుడు తక్కువ చేసి చూపిస్తే అభిమానులు కూడా ఒప్పుకునే వారు కాదు. అందుకే ఈ సినిమాను ఇలా చేయాల్సి వచ్చింది…