Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Tirupathi Devasthanam : ఆయనను తిరుమలలో నియమించి ఆశ్చర్యపరిచిన చంద్రబాబు

Tirumala Tirupathi Devasthanam : ఆయనను తిరుమలలో నియమించి ఆశ్చర్యపరిచిన చంద్రబాబు

Tirumala Tirupathi Devasthanam : కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అతి త్వరలో టిటిడి పాలకవర్గాన్ని నియమించనుంది. ఇప్పటికే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఓ మీడియా ఛానల్ అధినేత పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది.మరోవైపు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసి పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి పేరు సైతం వినిపిస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ పాలకవర్గాన్ని సైతం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించినట్లు సమాచారం.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వెనువెంటనే ప్రభుత్వం సైతం ప్రక్షాళన ప్రారంభించింది. టీటీడీ ఈవోగా శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. జేఈవోగా 2005 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని భక్తి చేసింది. ఇప్పుడు టీటీడీ జేఈఓ గా జైళ్ళ శాఖలో కోస్తాంధ్ర రేంజ్ డిఐజి ఎంఆర్ రవికిరణ్ నియమితులు కానున్నట్లు సమాచారం. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే టీటీడీ అధ్యక్ష పీఠాన్ని పవర్ ఫుల్ వ్యక్తికి అప్పగించాలని చూస్తోంది.అదే సమయంలో అధికారుల బృందాన్ని కూడా నియమిస్తోంది.తనకు టీటీడీ జేఈఓ గా అవకాశం ఇవ్వాలని జైల శాఖ డిఐజి రవికిరణ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయన నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.

* ప్రక్షాళన దిశగా
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో భక్తులు ఇబ్బంది పడ్డారు. భక్తుల నుంచి రకరకాల విమర్శలు వచ్చాయి కూడా. అందుకే ప్రక్షాళన దిశగా అడుగులు వేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా సమర్ధులైన అధికారులను తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలో జేఈవోలుగా వీరబ్రహ్మం,గౌతమి ఉన్నారు. వీరిలో వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్ నియమించే అవకాశం ఉందని సమాచారం.

* కొత్తగా కొన్ని శాఖలకు
ఇప్పటివరకు ఐఏఎస్ లు, ఐఆర్ఎస్ లు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వంటి అధికారులకే టీటీడీలో అవకాశం ఇస్తున్నారు. తాజాగా జైల శాఖ అధికారిని డిప్యూటేషన్ పై తీసుకొని నియమించేలా అవకాశం కల్పించనున్నారు. అందులో భాగంగానే రవి కిరణ్ కు పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.

* బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి ఆర్జిత సేవలు,బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబర్ మూడు నుంచి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.అందుకే వారికి సంతృప్తికరంగా దర్శనాలు కల్పించేందుకు బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version