YS Jagan Attack  : ఇంత ఘోరం జరుగుతున్నా బాబు ఎందుకు అడ్డుకోవడం లేదు.. జగన్ బాధ అదే

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఓటమి నుంచి జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : August 23, 2024 1:11 pm
Follow us on

YS Jagan Attack : జగన్ క్రమేపి విమర్శల డోసును పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న సమకాలిన అంశాలపై జగన్ స్పందిస్తున్నారు. ఇంకోవైపు పార్టీలో పునర్ నియామకాలు చేపడుతున్నారు. పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రంలో తప్పులు చేసేందుకు ఎవరైనా భయపడాలని..అంతలా శిక్షలు ఉండాలని చంద్రబాబు ప్రకటన చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జగన్. తప్పు చేయడానికి భయపడాలన్న చంద్రబాబే.. తప్పులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు.అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. జిల్లా ఎస్పీ అనుమతి తీసుకున్నా.. టిడిపి అల్లరి మూకలు అడ్డుకున్నాయంటే.. ఏపీలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతోంది అంటూ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ఇంటిని కూల్చివేశారని.. విధ్వంసాలకు పాల్పడిన పోలీస్ శాఖ నిస్సహాయంగా ఉండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.

* తరచూ బెంగుళూరుకి
వైసీపీకి ఓటమి ఎదురైన తర్వాత జగన్ తాడేపల్లి లో పెద్దగా ఉండడం లేదు. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి కి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. తిరిగి ఏపీకి వచ్చి దానినే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. అటు తరువాత ఆయన సైలెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవడంతో.. జగన్ తోక ముడిచారని ప్రత్యర్ధులు ప్రచారం చేయడం ప్రారంభించారు.

* వరుసగా సమావేశాలు
గత కొద్దిరోజులుగా జగన్ తాడేపల్లి లోనే ఉంటున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేర్పు మార్పులు సైతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వారికి అప్పగించారు. మరోవైపు పార్టీ అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు వారిని సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులపై కేసులు ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ ను అలెర్ట్ చేశారు.

* అధిగమించే ప్రయత్నం
సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనలకు కౌంటర్ ఎటాక్ చేయడంలో జగన్ వెనకబడ్డారన్నది ఒక ఆరోపణ. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అందులో భాగంగానే ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగట్టడం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే తాడిపత్రి ఇష్యూను ప్రస్తావించారు. ఒక మాజీ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే వీలు లేని పరిస్థితి ఏపీలో ఉందంటూ తన ఎక్స్ ఖాతాలో చంద్రబాబుకు నిలదీసినంత పని చేశారు.