https://oktelugu.com/

Krishna Express: ఇది రైలు బండి కాదు.. ఎడ్లబండి.. రికార్డు సృష్టించిన 50 ఏళ్ల ‘కృష్ణా ఎక్స్ ప్రెస్’ కథ*

భారతీయ రైల్వేనే ప్రపచంలో ఐదో స్థానంలో ఉన్న అతిపెద్ద వ్యవస్థ. శతాబ్దాలుగా మన దేశంలో రైల్వే వ్యవస్థ ఉంది. ఏటేటా విస్తరిస్తోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలోనూ రికార్డులు తిరగరాస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 6, 2024 / 11:10 AM IST

    Krishna Express

    Follow us on

    Krishna Express: భారతీయ రైల్వే వ్యవస్థం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవప్థలో ఐదో స్థానంలో ఉంది. దశాబ్దాలుగా మన దేశంలో పట్టాలపై రైళ్లు పరిగెత్తుతున్నాయి. బ్రిటిష్‌వారు తమ వ్యాపారం కోసం 1860లోనే రైల్వే లైన్‌ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఇండియన్‌ రైల్వే వ్యస్థం ప్రపంచంలో ఐదో స్థానానికి ఎదిగింది. ఇక ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంలోనూ ఏటేటా తన రికార్డులు బద్దలు కొడుతోంది. పేదల నుంచి సంపన్నల వరకు సురక్షితమైన జర్నీని అందించే భారతీయ రైల్వే వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. దక్షిణ మధ్య రైల్వే ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడుపుతున్న క్రిష్ణా ఎక్స్‌ప్రెస్‌ గుచించి తెలియని తెలుగువారుండరు. ఎందుకంటే.. రైలు ఎక్కడం వరకే మన పని గమ్యస్థానానికి చేర్చడం మన చేతుల్లో ఉండదు. భగవంతుడిమీద భారం వేసి ప్రయాణం సాగించాల్సిందే ఇంతవరకు ఈ రైలు షెడ్యూల్‌ను సమయపాలన ప్రకారం నడపాలనే ఆలోచన అధికారులకు కలుగలేదు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే అలా చిన్నచూపు చూసింది.

    ఐదు దశాబ్దాల చరిత్ర..
    ఇక కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. 1974, అక్టోబర్‌ 2వ తేదీన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైంది. డీజిల్‌ ఇంజిన్‌తో మొదట సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు నడిపారు. రెండుతెలుగు రాస్ట్రాలకు కృష్ణా నది వారధిగా ఉండడంతో ఈ రైలుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టారు. ఈ రైలు ప్రారంభంలో ఉదయం వేళ మాత్రమే నడిచేది. క్రమంగా ఈ రైలు గంటూరు వరకు పొడిగించారు. తర్వాత తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట ఇలా తిరుపతి వరకు నడుపుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మీదుగా ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడుస్తోంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 17405, 17406 నంబర్లతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రయాణికులు .

    సూపర్‌ఫాస్ట్‌గా నడపాలని..
    సరస్వతీదేవి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ రైలునే ఆశ్రయిస్తారు. అలాగే తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి ఈ రైలులోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. కాలక్రమంలో అనేక రైళ్లు వచ్చాయి. కానీ ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వరకు తక్కువ బడెజట్‌లో ప్రయాణానికి వీలుండే రైలు మాత్రం కృష్ణా ఎక్‌ప్రెస్‌ మాత్రమే. ఎక్కువగా పగటివేళ నడుస్తుంది. ఈ రైలును సూపర్‌ఫాస్ట్‌ రైలుగా నడపాలని ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.