https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి గేమ్ చేంజర్ సినిమా చూసి కొన్ని సీన్లు మార్చమని చెప్పారా..? ఇంతకీ ఆ సీన్లు ఏంటంటే..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2025 / 01:08 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ గా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇప్పుడు అంతకుమించిన సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇకమీదట సూపర్ సక్సెస్ లను అందుకొని హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడో అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ని ఏక ఛత్రాధిపత్యంతో ఏలుతున్నాడు. ఇక తన తర్వాత తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ అలాగే తన కొడుకు అయిన రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఫ్యామిలీ నుంచి దాదాపు 5 నుంచి 6 మంది హీరోలు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా వీళ్లు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఈ సినిమా ఈనెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం లో ఈ సినిమాని ఇప్పటికే చూసిన చిరంజీవి ఇందులో కొన్ని మార్పులనైతే చెప్పారట. చిరంజీవి ఎక్స్పీరియన్స్ ప్రకారం మార్పులను చేసిన శంకర్ ఇప్పుడు సినిమా చాలా గ్రిప్టింగ్గా వచ్చిందని అంటున్నారు. ఇక మొత్తానికైతే చిరంజీవి జడ్జిమెంట్ కి చాలా వాల్యూ అయితే ఉంటుంది.

    ఇప్పటివరకు ఆయన ఇతర సినిమాల విషయంలో కూడా ఆయన తీసుకున్న జడ్జిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందనే ఉద్దేశ్యంతోనే దిల్ రాజు, శంకర్, రామ్ చరణ్ ముగ్గురు కూడా చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. అయితే ఆ సీన్లు ఏంటి అంటే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ కొన్ని లెంతి గా ఉండడంతో వాటిని కట్ చేయించినట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే తప్ప రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టార్ గా తన సత్తా చాటే అవకాశమైతే లేదు. చూడాలి మరి ఇక మీదట రామ్ చరణ్ ఎలాంటి విజయాలను సాధిస్తాడు తద్వారా తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతాడా? లేదా అనేది…ఇక ఇప్పటికే చిరంజీవిని మించిన ఫాలోయింగ్ తో ముందుకు సాగుతున్నప్పటికి ఇండియాలో మాత్రం తన సత్తా చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది…