Mahesh Babu and Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ అయితే చేసుకున్నారు. మరి మహేష్ బాబు లాంటి నటుడు సైతం సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు… మరి ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళికి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ రోజుల్లో ఆయనకు భారీ ఆదరణ అయితే దక్కుతుంది. ఇక పాన్ వరల్డ్ లో కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన మహేష్ బాబుతో భారీ రేంజ్ లో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం దాదాపు 1300 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. మరి ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇందులో వైవిద్య భరితమైన మ్యూజిక్ అయితే ఉండాలి. దానికోసమే నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇంతకు ఆ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మొత్తానికైతే రాజమౌళి మాత్రం కీరవాణి తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులను సెలెక్ట్ చేసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి చేయబోతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక దానికి అనుగుణంగానే ఇంతకుముందు చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా భారీ యా, ఎలివేషన్స్ తో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక రీసెంట్ గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. మరి తొందర్లోనే ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి తీవ్రంగా ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన ఆయన తొందర్లోనే నటీనటులను కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…