Homeఎంటర్టైన్మెంట్Ram Charan story taken by Allu Arjun: రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను...

Ram Charan story taken by Allu Arjun: రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అల్లు అర్జున్ లాక్కున్నాడా..?

Ram Charan story taken by Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేయడం సర్వసాధారణం…ఆ సినిమా కథ లను జడ్జిమెంట్ చేయడంలో హీరోలు తీసుకునే నిర్ణయాలే వాళ్లని స్టార్లుగా మారుస్తాయి. ఒక సక్సెస్ ఫుల్ సినిమాని చెయ్యకపోవడం వల్ల కెరియర్ ను కోల్పోయిన హీరోలు చాలామంది ఉన్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలు మాత్రమే హీరోలు విజేతలుగా నిలుపుతాయి… ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘రేసుగుర్రం’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. మొదట ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాలని సురేందర్ రెడ్డి తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా కథ రామ్ చరణ్ కి నచ్చలేదట…

దాంతో అల్లు అర్జున్ కి ఈ మూవీ కథ తెలిసి సురేందర్ రెడ్డిని పిలిపించుకుని మరి కథ విని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కింది. రేసుగుర్రం పేరుతో వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది.

Also Read: ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఇప్పటి వరకు చిరంజీవి కూడా చేయలేదు…

అల్లు అర్జున్ కెరీర్ లోనే అప్పటివరకు లేనటువంటి భారీ సక్సెస్ ని తనకు అందించి కలెక్షన్ల రూపంలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో ధృవ అనే సినిమా వచ్చింది. తమిళంలో వచ్చిన తని ఓరువన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించింది. ఇక రామ్ చరణ్ ఈ సినిమా నుంచి కొత్తదనం వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు.

ఆ సినిమా ఇచ్చిన హై తో డిఫరెంట్ సబ్జెక్టులను ట్రై చేస్తే సక్సెస్ లు తప్పకుండా వస్తాయని నమ్మి మరీ ముందుకు సాగుతున్నాడు… ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిలబెట్టాయి. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన 2000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టడానికి మాత్రం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో 2000 కోట్లు మార్కును చేరుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular