Durandhar Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లు ఎక్కువగా వస్తున్నాయి. ఫిక్షన్ స్టోరీలతో పోలిస్తే బయోపిక్ లకి చాలా గొప్ప గుర్తింపైతే వస్తోంది. అలాగే రియల్ స్టోరీ తో సినిమాలను తెరకెక్కించే వాళ్లకు సైతం మంచి గుర్తింపైతే వస్తోంది. దాంతోపాటుగా ఇండియా పాకిస్తాన్ కు సంబంధించిన ఏ ఒక్క అంశంతో సినిమా తెరకెక్కిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈనెల 5వ తేదీన రిలీజ్ అయిన ‘దురంధర్’ సినిమా సైతం ఇండియా – పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే కావడం విశేషం… ఇక ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఇండియా ను ఎలా దెబ్బ కొట్టాలనే చూస్తుంది… ఇండియా మీద దాడులు చేస్తూ ఒకరకంగా దెబ్బ తీయాలని చూస్తున్నారు.
ఇక రీసెంట్ గా కాశ్మీర్ లోని పహాల్గం లో జరిగిన దాడికి ప్రతి దాడిగా మనవళ్ళు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో చేసిన ప్రతి దాడి కి పాకిస్తాన్ వెన్నులో వణికి పుట్టింది…ఇక ఇలాంటి నేపద్యం లోనే దూరంధర్ సినిమాను సైతం రియల్ స్టోరీ ని బేస్ చేసుకొని తీశారు… అజయ్ దోవల్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని మాధవన్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారు…
ఇక అర్జున్ రాంపాల్ మేజర్ ఇగ్బాల్ గా నటించాడు. ఆయన జియా ఉల్ హక్ చెప్పిన మాటను చెబుతూ ఆయన సిద్దాంతాన్ని ఫాలో అవుతాడు…ఇండియా కి పాకిస్తాన్ కి మధ్య 1965, 1971, 1999 లో యుద్ధాలు జరిగాయి. అందులో ప్రత్యక్షంగా ఇండియాను ఎదురుకోలేమని పాకిస్తాన్ కి అర్థమైంది. అప్పటి నుంచి ఇండియాను దొంగ దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక అక్షయ్ కన్నా పోషించిన రెహమాన్ క్యారెక్టర్ అప్పట్లో కరాచీ ప్రాంతాన్ని పాలించే వాడి రియల్ క్యారెక్టర్ కావడం విశేషం…
అలాగే పాకిస్థాన్ లో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా రణ్వీర్ సింగ్ వెళ్తాడు…ఇక దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి చూపించారు… నిజానికి మనల్ని దొంగ దెబ్బ కొడుతున్న పాకిస్థాన్ ను మనవాళ్ళు ఎలా సీక్రెట్ ఏజెంట్ తో బోల్తా కొట్టించారు అనేది ఈ సినిమా చాలా బాగా చూపించారు…అందుకే ఈ సినిమాను ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి అంటూ చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నారు…