Dhurandhar 2 trailer views record: మార్చి 19 న విడుదల అవ్వబోతున్న రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2′(Dhurandhar 2 – The Revenge) చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సాధారణమైన అంచనాలతో విడుదలైన ‘ధురంధర్ ‘ చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు దాదాపుగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఈ మాత్రం క్రేజ్ ఉండడం లో ఆశ్చర్యం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ఆడియన్స్ పర్వాలేదు రేంజ్ అనే టాక్ చెప్పారు, కానీ ట్రైలర్ మాత్రం జనాల్లోకి బాగా దూసుకెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం కలిపి ఈ ట్రైలర్ కి 312 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట.
యూట్యూబ్ లో హిందీ వెర్షన్ ట్రైలర్ కి 54 మిలియన్ల వ్యూస్ రాగా, తెలుగు వెర్షన్ ట్రైలర్ కి 9 మిలియన్ల వ్యూస్, తమిళ వెర్షన్ ట్రైలర్ కి 6 మిలియన్ల వ్యూస్, మలయాళం వెర్షన్ ట్రైలర్ కి 4.3 మిలియన్ వ్యూస్ , కన్నడ వెర్షన్ ట్రైలర్ కి 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద మూడు రోజుల్లో ఈ ట్రైలర్ కి కేవలం యూట్యూబ్ నుండి 78.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఇన్ స్టాగ్రామ్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి యాప్స్ మొత్తం కలిపి ఈ ట్రైలర్ కి 312 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ వసూళ్లను అందుకోవడం రాజమౌళి కి కూడా కష్టమైన టాస్క్ అనొచ్చు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ ప్రీమియర్ రికార్డ్స్ ని ఈ చిత్రం బద్దలు కొడుతుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఓజీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రీమియర్ షోస్ కి 65 కోట్ల రూపాయలకు దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు, ఇప్పటి వరకు దరిదాపుల్లో ఈ రికార్డుకు మరో హీరో సినిమా రాలేదు. ‘ధురంధర్ 2 ‘ కచ్చితంగా ఆ రికార్డుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.