Dhurandhar 2 Makers Impact On Peddi: పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమా భారీ వసూళ్లను రాబట్టడం అనేది అంత సులువైన విషయం కాదు, అన్నీ కలిసి రావాలి. తెలుగు వెర్షన్ తో పాటు, ఇతర వెర్షన్స్ లో కూడా క్లిక్ అయినప్పవుడే 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం తెలుగు వెర్షన్ నుండి అయితే కేవలం 300 నుండి 350 కోట్ల మధ్యలోనే ఆగాల్సి వస్తుంది. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘ఓజీ’ చిత్రం. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ హిందీ లో ఓటీటీ వెర్షన్ కేవలం నాలుగు వారాల్లోనే విడుదల చేసేలా ఒప్పందం కుదిరించుకోవడంతో ఈ చిత్రం అక్కడి నేషనల్ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో విడుదల కాలేకపోయింది. ఆ కారణం చేత హిందీ లో ఆ చిత్రానికి వసూళ్లు భారీ స్థాయిలో నమోదు అవ్వలేదు.
‘పెద్ది’ కి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు ముందుగా భయపడ్డారు. కానీ మేకర్స్ ఈ చిత్రానికి ఓటీటీ డీల్ ‘ఓజీ’ లాగా చెయ్యలేదు. తెలుగు వెర్షన్ ని నాలుగు వారాలకే ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చు కానీ, హిందీ వెర్షన్ ని 8 వారాల తర్వాతే విడుదల చేస్తారట. అంటే ఈ చిత్రానికి హిందీ లో చాలా భారీ రిలీజ్ ఉండబోతుంది అన్నమాట. ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్, ‘ధురంధర్ 2’ ని నిర్మించిన జియో స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది. వాళ్ళు ఎంత స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే, అంతటి రేంజ్ గ్రాస్ ఓపెనింగ్ ఈ చిత్రానికి హిందీ నుండి నమోదు అవుతాయి. ఎందుకంటే ఈ చిత్రం లోని పాటలు హిందీ లో కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఒకవేళ ఈ సినిమాకు రంగస్థలం రేంజ్ టాక్ వచ్చి, హిందీ ఆడియన్స్ ని థియేటర్స్ కి కదిలించగలిగితే మాత్రం , వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు అవలీలగా వచ్చేస్తాయని అంటున్నారు.
జూన్ 4 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అభిమానుల కోసం ఒక రోజు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేస్తున్న. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు , ఇండియా వైడ్ గా అన్ని ప్రాంతాల్లోనూ ప్రీమియర్ షోస్ వేసే ఆలోచనలో ఉన్నారట. దీనిని బట్టీ ఈ చిత్రం ఫలితం పై మేకర్స్ లో ఏ రేంజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారో తెలుస్తోంది. ఇన్ని రోజుల ఎదురు చూపులకు జూన్ 4 న ఈ చిత్రం ఏ స్థాయిలో తెరదించబోతుందో చూడాలి.