Dhurandhar 2 First Review: గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ అన్ని భాషల్లో విడుదలైనవే. అన్ని భాషలకు కలిపి వచ్చిన వసూళ్లు వెయ్యి కోట్ల వరకు ఉండేది. కానీ ఈ చిత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలైంది. అంతే కాకుండా బాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ అయినటువంటి మిడిల్ ఈస్ట్ లో ఈ సినిమాని విడుదల కానివ్వకుండా చేశారు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ ని నెలకొల్పింది అనేది.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) మూవీ వచ్చే నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని ఈసారి అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. కాబట్టి అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి హిందీ వెర్షన్ లోనే 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఒక్క హిందీ సినిమాకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు రాలేదు. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాకు సీక్వెల్ తెలుగు లో రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఏ రేంజ్ విద్వంసం ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. అయితే ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య డర్ సతీమణి, యామి గౌతమ్ డర్ ఈ సినిమాని చూసిన తర్వాత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: కోటి రూపాయిల బడ్జెట్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ ‘ తీశారు..కానీ 2 వారాల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా!
ఆమె మాట్లాడుతూ ‘నా భర్త ఆదిత్య తన వృత్తిని దైవం గా భావిస్తాడు. అందుకే ఎన్నో గొప్ప సినిమాలను ఆయన వరుస పెట్టి తీస్తున్నారు. రీసెంట్ గానే నేను ‘ధురంధర్ 2 ‘ చిత్రాన్ని చూశాను . నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఆర్టికల్ 370 మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు ‘ధురంధర్ ‘ స్క్రిప్ట్ చదివాను. అది చదివిన తర్వాత నా కళ్ళలో నుండి నీళ్లు ఆగలేదు. కొన్ని రోజుల వరకు ఆ ట్రాన్స్ లోనే ఉన్నాను. ధురంధర్ 2 చిత్రం కూడా మీకు అలాంటి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది . ఈ చిత్రం కచ్చితంగా ప్రతీ భారతీయుడు గర్వపడే విధంగా ఉంటుంది ‘ఆ అంటూ చెప్పుకొచ్చేసింది . ఇలా మొదటి రివ్యూ ని ఇచ్చేసింది అన్నమాట , మరి ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో తెలియాలంటే మార్చి 19 వరకు వరకు ఆగాల్సిందే.