Dhurandhar 2 box office collections: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) మూవీ సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూసి ట్రేడ్ పండితులు సైతం నివ్వెర పోతున్నారు. రాజమౌళి కి తప్ప, ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న అనితర సాధ్యమైన వసూళ్లను ఈ చిత్రం అవలీలగా రాబట్టడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది. మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని ఇప్పటి వరకు కేవలం ‘పుష్ప 2’ మాత్రమే రాబట్టింది. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘ధురంధర్ 2’ కూడా చేరబోతోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. కేవలం నాల్గవ రోజున ఈ చిత్రానికి 103.7 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది.
మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ నుండి 405 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 478 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే సగటున రోజుకి 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు అన్నమాట. డబ్బింగ్ బాషల(తెలుగు + తమిళ్ + కన్నడ) నుండి దాదాపుగా 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నాల్గవ రోజు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి డబ్బింగ్ భాషల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి గమనిస్తే , తెలుగు నుండి 5 కోట్ల 83 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళం నుండి 3 కోట్ల 7 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా నాల్గవ రోజున హిందీ వెర్షన్ కి 18,933 షోస్ ని ప్రదర్శించగా , 116 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ అసలు ఊహించలేదు!
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు వచ్చినంత వసూళ్లు రాజమౌళి ‘వారణాసి’ కి కూడా రావడం కష్టమే అని తెలుస్తోంది. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 21 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే 197 కోట్ల రూపాయిలు. ‘ధురంధర్’ చిత్రానికి ఓవర్సీస్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు క్లోజింగ్ లో వచ్చాయి. కానీ ‘ధురంధర్ 2’ ప్రభంజనం చూస్తుంటే ఈ చిత్రానికి కచ్చితంగా క్లోజింగ్ లో ఓవర్సీస్ నుండి 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.