Dhee 20 Latest Promo: ప్రస్తుతం సినిమాలతో పాటు టెలివిజన్ లో వచ్చే రియాల్టీ షోలకి కూడా చాలా వరకు క్రేజ్ అయితే పెరుగుతోంది. ఇక డ్యాన్స్ షో ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఇక ఢీ షో కి చల్ మంచి గుర్తింపైతే ఉంది. మొదట్లో చాలా డీసెంట్ షో గా పేరు తెచ్చుకున్నప్పటికి ఇప్పుడిప్పుడు ఈ షో కి ఉన్న పరువు మొత్తం తీసేస్తున్నారు. ఈ షో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా 19 సీజన్లను కంప్లీట్ చేసుకొని 20వ సీజన్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ సీజన్ ని కూడా చాలా వరకు సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ షో లో రోజురోజుకీ కంటెస్టెంట్లు చేసే పర్ఫామెన్స్ లో అయితే వల్గారిటీ పెరిగిపోతోంది. మరి డైరెక్షన్ టీం కావాలనే అలా చేయిస్తున్నారా? లేదంటే కంటెస్టెంట్స్ అలా చేస్తున్నారా అనేది తెలీదు గానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ షో ప్రోమో ను కనక మనం చూసినట్లయితే అందులో అష్రాఫ్ మాస్టర్ అన్షు తో డాన్స్ చేస్తూనే తనకి కిస్సులు పెట్టాడు. అలాగే సంకేత్ సైతం తన కో డాన్సర్ కి కిస్సులు అయితే పెట్టాడు.
ఇదంతా చూసిన ఆడియన్స్ మాత్రం ఇది షో అనుకుంటున్నారా.? లేదంటే ఇంకేదైనా అనుకుంటున్నారా? ఆ ముద్దులు పెట్టడం ఏంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షో అంటే షో లాగే ఉండాలి గాని, ఇలా వల్గారిటీ ని పెంచుతూ సగటు ప్రేక్షకులకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటూ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి డ్యాన్స్ షోల వల్ల ప్రేక్షకులకు ఎలాంటి యూజ్ ఉంది. అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇలాంటి షో లను ఇంట్లో పిల్లలతో కలిసి చూడాలంటే చాలా వరకు ఇబ్బంది కలుగుతుందంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…
మరి ఇలాంటి షోలో వల్గారిటీ లేకుండా చేస్తే బాగుంటుంది. కానీ టిఆర్పి రేటింగ్ ల కోసం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం షోనే క్లోజ్ అయిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేస్తే బాగుంటుందంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తుండడం విశేషం…