Raju-Anshu Reddy Love Track: టెలివిజన్ రంగంలో చాలా షోలు ప్రస్తుతం ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి షోలు చేసిన కూడా ఇప్పుడు వస్తున్న షో లు మాత్రం ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఢీ షో చాలా సంవత్సరాల నుంచి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక తెలుగులోనే అత్యంత పెద్ద షోగా పేరు సంపాదించుకున్న ఈ డాన్స్ షో సక్సెస్ ఫుల్ గా 19 సీజన్స్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు 20 వ సీజన్ సైతం టాప్ రేటింగ్ తో ముందుకు సాగుతోంది… ఇక ఈ వారం ‘ఫీల్ మై లవ్’ అనే థీమ్ సాంగ్స్ లో పర్ఫామెన్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చేవారం జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు… ఇక ఈ ప్రోమో ను కనక మనం చూసినట్లయితే ఇందులో డ్యాన్సర్ రాజు కి, సీరియల్ నటి అయిన అన్షు కి మధ్య ఏదో ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్లకు సంబంధించిన పాటల్లో వాళ్ళిద్దరు హాగ్ చేసుకునేలా షో ను అయితే ప్లాన్ చేశారు.
మరి మొత్తానికైతే ఇలాంటి ఎక్స్ట్రా ఆక్టివిటీస్ వల్ల షో కి భారీ రెస్పాన్స్ వస్తుందని, టిఆర్పి రేటింగ్ కూడా చాలా బాగా పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఇంతకుముందు జబర్దస్త్ షో లో సైతం సుధీర్, రష్మీ మధ్య ఏదో జరగుతోంది అంటూ చాలా సంవత్సరాల పాటు ఒక రూమర్ ని ప్రేక్షకుడి చేత నమ్మించే ప్రయత్నం చేసి ఆ షో ను సక్సెస్ చేసుకుంటూ వచ్చారు.
ఇక వాళ్ల టైం అయిపోవడంతో మరికొందరి మీద కూడా అలాంటి ప్రయోగాలు అయితే చేశారు. కానీ అవి అంత సక్సెస్ కాలేదు. ఇక దాంతో రాజు – అన్షు మధ్య ఏదో ఉందని ఇప్పుడు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇదంతా టిఆర్పి రేటింగ్ లో భాగమే అని ప్రేక్షకులు పసిగడుతున్నారు.
ఇక మరి కొంత మంది మాత్రం ఇదంతా నిజంగానే జరుగుతుందేమో అనే ఒక భ్రమలో అయితే ఉన్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వచ్చే ఎపిసోడ్ ను వాళ్ళిద్దరి మీద నడపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ ప్రోమో ను కట్ చేశారు. ఇక వీళ్ళ కాంబినేషన్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…