Pandu Viral Performance: ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఆడియన్స్ నుండి ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఒక విధంగా బుల్లితెర పై అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈటీవీ నే. ఈ ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకున్న ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి ‘ఢీ'(Dhee 20). ఇండియా లోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ షో గా మొదలై దాదాపుగా 19 సీజన్స్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం 20 వ సీజన్ ని జరుపుకుంటుంది. అంటే దాదాపుగా 20 ఏళ్ళ నుండి ఈటీవీ ఛానల్ లో ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ షో కొనసాగుతూ వస్తుంది అన్నమాట. ప్రస్తుతం జరుగుతున్న 20 వ సీజన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. గత సీజన్స్ కి సంబంధించిన టాప్ కంటెస్టెంట్స్ అందరినీ ఈ సీజన్ లోకి తీసుకొచ్చారు. నందు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో రెజీనా(Regina Cassandra), విజయ్ బెన్నీ మాస్టర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: మహావతార్ నరసింహ’ యూనివర్స్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..?
మొదటి ఎపిసోడ్ నుండే అద్భుతమైన పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లలో మొన్నటి ఎపిసోడ్ లోని పండు డ్యాన్స్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సాధారణంగా సినిమాల్లోని సాంగ్స్ కి డ్యాన్స్ వేస్తుంటారు కంటెస్టెంట్స్. కానీ ఈసారి పండు(Pandu Dance Performance) ప్రత్యేకంగా కంటెస్టెంట్స్ అందరి మీద ఒక పాట ని స్వయంగా కంపోజ్ చేయించుకొని, అదిరిపోయే రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ చిందులు వేశాడు. పండు డ్యాన్స్ వేస్తున్నంతసేపు కంటెస్టెంట్స్ నవ్వుతూనే ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి ముందు ఆయన బాటమ్ 6 లో ఉండేవాడు. కానీ ఈ ఒక్క డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆయన టాప్ 6 లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఈయన అనేక సీజన్స్ లో పాల్గొన్నాడు కానీ, ఒక్క సీజన్ లో కూడా టైటిల్ ని గెలవలేకపోయాడు.
Also Read: కింగ్డమ్ మూవీలో భాగ్య శ్రీకి షాక్.. ఆమె భవిష్యత్ ఏంటి..?
కేవలం ఒకే ఒక్కసారి ఫైనలిస్ట్ అయ్యాడు. ఈ ఎలిమెంట్ ని ఆయన కామెడీ కోసం వాడుకుంటూ ‘ఈసారి కప్ నామదే’ అంటూ ప్రతీ ఎపిసోడ్ లో అల్లడిస్తున్నాడు. కేవలం కామెడీ చేయడం మాత్రమే కాదు, డ్యాన్స్ విషయం లో కూడా ఈయన ఎక్కడా తగ్గడం లేదు. చూస్తుంటే నిజంగా కప్ కొట్టేందుకు ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. గతం లో పండు అమ్మాయి గెటప్ వేసుకొని చేసిన ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఢీ హిస్టరీ లోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న పాట గా నిల్చింది. మొన్న చేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ యూట్యూబ్ లో ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్స్ లో కూడా పండు ఇలాంటి సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడట. చూడాలి మరి ఈసారైనా ఆయనకు ట్రోఫీ అందుతుందో లేదో అనేది.