Dhee 20 Latest Promo: ఈమధ్య కాలం లో బుల్లితెర మీద ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షోస్ లో డ్యాన్స్ చేయమంటే కంటెస్టెంట్స్ సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు. ప్రమాదకరమైన ఆ సక్సెస్ ఫీట్స్ ని చూసి ప్రేక్షకులు భయపడుతున్నారు. డ్యాన్స్ చేయమంటే ఈ సర్కస్ ఫీట్స్ ఏంటి?, సంబంధం లేని పాటకు సంబంధం లేని స్టెప్పులేంటి?, మేము ఏమి పాపం చేశామని మాకు ఈ శిక్ష వేస్తున్నారు అంటూ చూసే ఆడియన్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్స్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో ఇలాంటివి ఎక్కువగా జరిగేవి. అందుకే గత రెండు మూడు సీజన్స్ నుండి ఈ షో ని చూడడం ఆడియన్స్ దాదాపుగా మానేశారు. దీనిని అర్థం చేసుకున్న యాజమాన్యం సర్కస్ ఫీట్స్ ని ఆపేయమని బలంగా కొరియోగ్రాఫర్స్ కి చెప్పారో ఏమో తెలియదు కానీ, ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఢీ 20 షో లో మాత్రం సర్కస్ ఫీట్స్ లేకుండా, కేవలం స్వచ్ఛమైన డ్యాన్స్ ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు.
Also Read: అక్షరాలా 400 రూపాయిల కోట్ల నష్టం..ఎన్టీఆర్ కెరీర్ లో మాయని మచ్చ ఇది!
కంటెస్టెంట్స్ కూడా అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఇది కదా మేము ఇన్ని రోజులు కోరుకున్నది అనే ఫీలింగ్ ని తెచ్చి పెట్టారు. ఈమధ్య కాలం లోనే పండు మాస్టర్ వేసిన ‘ఇటుక మీద..ఇటుక’ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. సరికొత్త కాన్సెప్ట్ తో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తే ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీనికి పోటీ గా మిగిలిన కంటెస్టెంట్స్ కూడా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగాంగా రాజు మాస్టర్ తో చిట్టి మాస్టర్ కంపోజ్ చేసిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.
బట్టలు లేకుండా, కేవలం బాత్రూం టవల్ తో క్రింది భాగాన్ని కవర్ చేసుకుంటూ చాలా కొత్తగా ఈ డ్యాన్స్ స్టెప్స్ ని కంపోజ్ చేశారు. ఈ పాటకు జడ్జీల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో ని సోషల్ మీడియా లో విడుదల చేయగా, అది కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ పాట కోసం ఇప్పుడు ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బుధవారం ఎపిసోడ్ లో కానీ, లేదా గురువారం ఎపిసోడ్ లో కానీ ఈ పాట టెలికాస్ట్ అవ్వబోతుంది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ ప్రోమో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.