Dhee Vinayaka Chavithi Special: కొన్నేళ్ల క్రితం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth), ఢీ(Dhee 20) వంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో సుధీర్(Sudigaali sudheer), రష్మీ(Rashmi gautam) లవ్ ట్రాక్ పెద్ద హిట్ అయ్యింది. వీళ్ళ లవ్ ట్రాక్ నిజామా కాదా అనేది పక్కన పెడితే, ఆన్ స్క్రీన్ పై వీళ్ళ కెమిస్ట్రీ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకటి సక్సెస్ అయితే దానిని అనుసరిస్తూ మరిన్ని రావడం సినీ ఇండస్ట్రీ లో అయినా, బుల్లితెర లో అయినా సర్వ సాధారణమే కదా. అలా వీళ్ళని చూసి బుల్లితెర పై ఎన్నో లవ్ ట్రాక్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ లవ్ ట్రాక్ కి ఢీ షో లో పునాదులు వేస్తున్నారు. ఇలాంటివి వర్కౌట్ అవ్వడం లేదని తెలిసినా కూడా ఎందుకు ఇలాంటి పులిహోర కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. కనీసం నమ్మే విధంగా ఉంటే కాన్సెప్ట్స్ ని డిజైన్ చేయొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అక్షరాలా 400 రూపాయిల కోట్ల నష్టం..ఎన్టీఆర్ కెరీర్ లో మాయని మచ్చ ఇది!
వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఈటీవీ లో ప్రతీ బుధవారం, గురువారం టెలికాస్ట్ అయ్యే ఢీ20 షోలో సరికొత్త లవ్ ట్రాక్ మొదలైంది. రాజు(Raju Master), అన్షు రెడ్డి(Anshu Reddy) కి ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక ప్రోమో ని విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ముందుగా యాంకర్ నందు అన్షు రెడ్డి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ షో లో ఉన్న అబ్బాయిలతో ఎవరు నీకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తావు?’ అని అడగ్గా, దానికి అన్షు రెడ్డి రాజు మాస్టర్ పేరు చెప్తుంది. అప్పుడు ఆయన సిగ్గు పడడం, అన్షు రెడ్డి కూడా సిగ్గుతో నవ్వడం, అబ్బో చూసే ప్రేక్షకులకు చాలా న్యాచురల్ గా అనిపించేసింది. ఇక ఆ తర్వాత రాజు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అయిన తర్వాత ఆయన స్పెషల్ గా అన్షు రెడ్డి ని తన డ్యాన్స్ ఎలా ఉంది అని అడగడం, దానికి ఆమె మురిసిపోతూ సమాధానం చెప్పడం, ఎందుకులే ఆ ప్రోమో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ఢీ 20 షో మంచిగా రన్ అవుతుంది, దానిని సాఫీగా అలాగే సాగనివ్వొచ్చు కదా, ఎందుకు ఈ స్క్రిప్టెడ్ లవ్ స్టోరీస్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.