Dhee 20: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా భారీ మార్పులైతే జరిగాయి… రియాల్టీ షోలు తమ హవా ను చూపిస్తూ టాప్ టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే డి సీజన్ 20 రీసెంట్ గా స్టార్ట్ అయి టాప్ గేర్ లో ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇంతకు ముందు ఢీ 19 సీజన్స్ భారీ పాపులారిటీ ని సంపాదించుకున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఈ షోలో రాజు అన్షుల మధ్య ప్రేమ అయితే చిగురించి వాళ్ళిద్దరూ ప్రస్తుతం లవ్ చేసుకుంటున్నారనే న్యూస్ అయితే బయట చక్కర్లు కొడుతోంది. ఇక దానికి సంబంధించిన ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైపర్ ఆది అన్షు తో ఇక్కడున్న అందరు కంటెస్టెంట్స్ లో ఎవరు ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావ్ అనగానే అన్షు వెంటనే రాజు అని చెప్పింది. దానికి కారణం ఏంటి అని హైపర్ ఆది అడగడంతో నా మొదటి కాంపిటేటర్ అతనే కాబట్టి నాకు నచ్చాడు. అలాగే ఆ కాంపిటీషన్లో నేను ఓడిపోయిన తర్వాత మీకు మంచి ఫ్యూచర్ ఉంది.
Also Read: ఘాటీ’ లో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్!
బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంటూ నన్ను ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఆయన నాకు ఇష్టం అంటూ తను చెప్పింది. దాంతో హైపర్ ఆది వాడు నిన్ను ఎంకరేజ్ చేయడం లేదు వాడి దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఇక ఇదంతా చూసిన ప్రేక్షకులు సైతం అన్షు రాజుని ప్రేమించడం హైపర్ ఆదికి నచ్చడం లేదంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా హైపర్ ఆది జబర్దస్త్ షోలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక దాంతో ఆ తర్వాత ఆయన వరుసగా కామెడీ షో లో పాల్గొంటూ వస్తున్నాడు. ముఖ్యంగా మల్లెమాల వాళ్లు నిర్వహించే ఈవెంట్స్ లో అయితే పాల్గొంటున్నాడు. ఇక వాటి ద్వారా ఆయన చాలా బాగా ఫేమస్ అవుతున్నాడు.
ఇక దాంతో పాటుగా పలు సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది…మరి రాజు – అన్షు ల మధ్య ప్రేమ వ్యవహరం ఎక్కడ దాకా వెళుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…