Dhanush and Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…ఆయన కెరియర్ మొదట్లో రైటర్ గా కథ మాటలను అందించి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. ఇక ఇలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇకమీదట చేయబోతున్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటాయనే ఉద్దేశ్యంతో అతని అభిమానులైతే ఉన్నారు. ఇక తను ఇంతకుముందు మహేష్ బాబు (Mahesh Babu) తో చేసిన ‘గుంటూరు కారం ‘ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతన్ని ఏ స్టార్ హీరో కూడా నమ్మలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి ఆయన అట్లీ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తప్ప త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. దానికి కారణం ఏంటి అంటే త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో మార్కెట్ అయితే లేదు ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు.
Also Read : ధనుష్ విడాకులకు కారణం అమలాపాల్..? వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
దానివల్లే పుష్ప 2 (Pushpa 2) లాంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ లాంటి తెలుగుకే పరిమితమైన దర్శకుడితో చేస్తే ఆయన మార్కెట్ పడిపోతుందనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ అట్లితో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు… ఇక ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం అల్లు అర్జున్ కోసం వేచి చూడకుండా ధనుష్ కి ఒక కథను వినిపించారట.
మరి ఈ కథ అతనికి బాగా నచ్చడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక స్టోరీ లైన్ కనక మనం చూసుకున్నట్లయితే ఇది 200 సంవత్సరాల క్రితం జరిగే స్టోరీగా తెలుస్తోంది. ఇక డిఫరెంట్ సినిమాలను చేయడంలో ధనుష్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.
కాబట్టి ఈ సినిమాకు తను మాత్రమే ఆప్ట్ అవుతాడనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు తద్వారా తర్వాత చేయబోయే సినిమాలతో స్టార్ హీరోలను లైన్ లో పెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : డైలమాలో పడిన త్రివిక్రమ్…ఇప్పుడు తన దారెటు…