Good Bad Ugly' Twitter talk
Good Bad Ugly Twitter Talk: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకు మొదటి నుండే అంచనాలు భారీ గా ఉండేవి. ఎందుకంటే ఈ చిత్ర దర్శకుడు అద్విక్ రవిచంద్రన్(Advik Ravichandran) అజిత్ కి వీరాభిమాని. గతంలో తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఆయన గత చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత అజిత్ ఒక యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. అది కూడా వీరాభిమాని తో, కచ్చితంగా అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ సినిమాని ఇస్తాడని అంతా అనుకున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు కూడా అదే రేంజ్ ఉండడంతో అజిత్ కం బ్యాక్ ఇచ్చేసాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
#GoodBadUglyFDFS #GoodBadUgly #GoodBadUglyFromApril10
Pure entertainment. Fanboy Sambavan @Adhikravi . pic.twitter.com/al5912ZoJ5
— Marktony (@Marktony899159) April 10, 2025
అలా ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. ఏ సినిమాకి అయినా ఓవర్సీస్ టాక్ తెల్లవారు జామునే ట్విట్టర్ లో వచ్చేస్తుంది. ‘విడాముయార్చి’ చిత్రానికి ట్విట్టర్ లో మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ చాలా నీరసంగా ఉండేవారు. కానీ ‘గుడ్ బ్యాక్ అగ్లీ’ చిత్రానికి అలా లేదు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మంచి పాజిటివ్ జోష్ తో ఊగిపోతున్నారు. ఇది కదా మేము అజిత్ నుండి కోరుకున్నది, ఆయన విశ్వరూపాన్ని ఈ చిత్రం లో చూపించాడు అంటూ అభిమానులు ఎంతో ఆనందంతో ట్వీట్స్ వేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు ఉన్నాయి కానీ, ఓవరాల్ గా సినిమా మొత్తం సూపర్ హిట్ అనే ఫీలింగ్ చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తాదని ట్విట్టర్ నుండి టాక్ వచ్చింది.
Dong Lee ❌
John Wick ❌
Money Heist ❌
Red dragon ✅ ✅ ✅
Fans stuff!!
After long wait finally #Thala delivered#GoodBadUgly pic.twitter.com/eOsknVo4tA— shivaram reddy gaddam (@shivashiv30) April 10, 2025
ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. చాలా కాలం నుండి అజిత్ తన మార్క్ హీరోయిజాన్ని సినిమాల్లో చూపించలేదు. కొంతమంది అభిమానులు ఈ విషయం లో తీవ్రమైన ఆగ్రహాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. అలాంటి అభిమానులు నేడు ఆనందం తో కన్నీళ్లు తుడుచుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క మాట లో చెప్పాలంటే ఈ సినిమా అజిత్ ‘గబ్బర్ సింగ్’ అని అనొచ్చు. ఇలాంటి పాజిటివ్ టాక్ అజిత్ సినిమాకు వచ్చి 7 ఏళ్ళు దాటిపోయింది. యావరేజ్ రేంజ్ కంటెంట్ సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న అజిత్ కి, ఒక్క సూపర్ హిట్ టాక్ కంటెంట్ ఉన్న సినిమా పడితే ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏర్పడుతుందో మీరే ఊహించుకోండి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే తమిళనాడు లో ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఊపు చూస్తుంటే కచ్చితంగా మొదటి రోజు ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసేలా ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
Finished watching the premiere show. Theatre blast
Goosebumps, mass elevations, vintage thala, retro songs.
Thala erangi vantha !! elarum thalli poi tha aavanum
Sure shot Blockbuster #Ajithkumar @Adhikravi @SureshChandraa
— Benny Prabakar (@bennyprabakar10) April 10, 2025
#GoodBadUgly is an Alright Out and Out Mass Entertainer that works in parts and is a pure fan service to Ajith.
After a Solid 1st half, the second half starts well with a flashback episode but has nothing much to offer after that and feels dragged till the end. A few mass…
— Venky Reviews (@venkyreviews) April 10, 2025
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Good bad ugly twitter talk
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com