Virat Kohli : విరాట్ కోహ్లీని ఒక స్టార్ క్రికెటర్ మాత్రమే కాదు. అతడిని చూసి స్ఫూర్తి పొందే వారు చాలామంది ఉన్నారు. అతడిలాగా ఆడాలని.. అతడి లాగా ఉండాలని.. గొప్ప ప్రేమికుడిగా.. గొప్ప భర్తగా.. గొప్ప తండ్రిగా.. గొప్ప కొడుకుగా.. గొప్ప ఆటగాడిగా.. హ్యుమానిటీ ఉన్న మనిషిగా పేరు తెచ్చుకోవాలని భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే అతడికి ఏకలవ్య శిష్యులు.. ఏకలవ్య అభిమానులు చాలామంది ఉన్నారు. అందులో ఓ అభిమాని ఇప్పుడు విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాకపోతే అతడు క్రికెట్ ఆటగాడు కాదు. క్రికెట్ చూస్తాడు గాని.. క్రికెట్ ఆడతాడు గాని.. అది గల్లి స్థాయి దాటలేదు. కాకపోతే విరాట్ మీద అభిమానం మాత్రం అది ఆకాశాన్ని దాటిపోయింది. దానిని కొలిచే కొలమానం లేదు. వివరించే ఉపోద్ఘాతం లేదు. చెప్పే ఎలివేషన్ కూడా లేదు. విరాట్ కోహ్లీని అంతగా అభిమానించే ఆ అభిమాని పేరు గూర్పాన్ ఖాన్. ఇతడు విరాట్ కోహ్లీ మాట్లాడే మాటలను జాగ్రత్తగా వినేవాడు. అందులో ఉన్న లౌక్యాన్ని.. కామెడీని అత్యంత జాగ్రత్తగా పరిశీలించేవాడు. తను రాసిన నవలలు విరాట్ కోహ్లీ మాటలను కూడా గూర్పాన్ ఖాన్ పొందుపరిచాడు. అంతేకాదు వివిధ వేదికల్లో విరాట్ కోహ్లీ ప్రస్తావించిన విషయాలను కూడా ఇందులో ప్రముఖంగా రాశాడు. అందువల్లే ఈ నవల అందరికీ నచ్చుతుంద ని గూర్పాన్ ఖాన్ స్పష్టం చేస్తున్నాడు.
Also Read : విరాట్ జపం చేస్తున్న జాన్ సీనా.. ఇన్ స్టా లో ఏం పోస్ట్ చేశాడంటే?
నవల రాశాడు
విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ఆరాధించే.. మైదానంలో అతడు ఆడుతుంటే విపరీతంగా చూసే వ్యక్తి పేరు గూర్పాన్ ఖాన్. ఇతడిది బెంగళూరు అని తెలుస్తోంది. క్రికెట్ ఇష్టంగా చూస్తుంటాడు. విరాట్ ఆడితే టీవీకి అతుక్కుపోతాడు. అది కుదరకపోతే ఫోన్లోనే మునిగిపోతాడు. అయితే విరాట్ కోహ్లీ వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తుంటాడు గుఫ్రాన్ ఖాన్.. ట్విట్టర్ ఎక్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా అనుసరిస్తుంటాడు. ఆ జట్టు చేసే ట్వీట్లను రీ ట్వీట్ చేస్తుంటాడు. అయితే అతడు విరాట్ కోహ్లీ స్ఫూర్తితో ఒక నవల రాశాడు. దాని పేరు సోమ్ నో లెన్సియా; ది నాట్ దట్ కంక్వర్డ్ ది వరల్డ్.. ఇది సంస్కృతి గొప్పతనాన్ని వివరిస్తూనే.. హాస్యాస్పదంగా.. శక్తివంతంగా రాసిన ఒక నవల.. ఈ కాలం ప్రజలు తప్పక చదవాల్సిన నవల. అయితే ఈ నవలను త్వరలోనే విరాట్ కోహ్లీకి అందిస్తానని గూర్పాన్ ఖాన్ చెబుతున్నాడు..” ఇది అందరికీ చేరాల్సిన కథ. అందరూ చదవాల్సిన కథ. దీనిని ఎంతో గొప్పగా రీసెర్చ్ చేసి రాశాను. అది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. విరాట్ కోహ్లీకి త్వరలో ఈ నవలకు సంబంధించిన కాపీని అందిస్తానని” గుఫ్రాన్ ఖాన్ వెల్లడించాడు.
Also Read : విరాట్ కోహ్లీ నటించిన ఏకైక సినిమా అదేనా? ఇన్ని రోజులు గమనించలేదుగా!