Dhanush Comments On Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం ఈ నెల 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వచ్చింది కాబట్టి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముందు సినిమాలకు ప్రస్తుతం చేసే సినిమాలకు అసలు సంబంధం ఉండదు. హృదయాలకు హత్తుకునే విధంగా ఆయన సినిమాల్లోని సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు ‘కుబేర’ చిత్రం లో బోలెడన్ని ఉన్నాయని టీజర్ ని చూస్తేనే తెలుస్తుంది. ఈ నెల 13న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి డైలాగ్ కంటెంట్ వినలేదు. కథ అర్థం అయ్యి అవ్వనట్టుగా ప్రమోషనల్ కంటెంట్ వదిలారు. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి?, నాగార్జున క్యారక్టర్ ఏంటి?, ఒక బిచ్చగాడిగా బ్రతికే ధనుష్ అన్ని సమస్యల్లో ఎలా చిక్కుకున్నాడు అనేది తెలుసుకోవాలని ఆడియన్స్ లో కూడా కుతూహలం ఉంది. ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమాకు సంబంధించిన పాటని ముంబై లో ఒక ఈవెంట్ ద్వారా విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి ధనుష్, నాగార్జున, రష్మిక మందాన మరియు ఇతర తారాగణం పాల్గొనింది. ధనుష్ కి షూటింగ్ ఉండడం తో అందరి కంటే ముందుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. బాగానే మాట్లాడాడు కానీ,ధనుష్ ప్రవర్తన పట్ల అక్కినేని ఫ్యాన్స్ చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ధనుష్ తన ప్రసంగం లో ఒక్కసారి కూడా నాగార్జున పేరు ని తీయకపోవడమే.
తన ప్రసంగం లో శేఖర్ కమ్ముల గురించి మాట్లాడాడు, హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాడు, కానీ నాగార్జున పేరు కూడా ప్రస్తావించలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాగార్జున టాప్ 3 హీరోలలో ఒకడు. ఆయన సాధించిన విజయాలు, చూసిన క్రేజ్ లో ధనుష్ ఆవగింజంత కూడా చూసి ఉండదు. అలాంటి స్థాయి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడకుండా వెళ్తావా అంటూ సోషల్ మీడియా లో అక్కినేని అభిమానులు ధనుష్ ని ట్యాగ్ చేసి ఏకిపారేస్తున్నారు. అయితే ధనుష్ షూటింగ్ కి వెళ్లే హడావడిలో ఉన్నాడని, ఆయన ఇచ్చింది ప్రసంగం కాదని, యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడని, యాంకర్ నాగార్జున గురించి అడగకపోతే ధనుష్ ఏమి చేస్తాడంటూ మరో వర్షన్ ధనుష్ కి సపోర్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు వాదనలలో నిజం ఉంది, దీనిపై ధనుష్ క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. ధనుష్ నాగార్జున గురించి మాట్లాడకపోయినా నాగార్జున మాత్రం ధనుష్ గురించి మాట్లాడడం విశేషం.
View this post on Instagram