Shobhana Kamineni: నేటి తరం యువత ఒక్క గంట వర్కౌట్స్ చేయడానికే ఆపసోపాలు పడుతుంటారు. ఒక్క అరగంట వాకింగ్ చేయడానికి కూడా ఆసక్తి చూపరు. అలాంటిది 60 ఏళ్ళ వయస్సు లో ఒక మహిళ హైదరాబాద్ నుండి చెన్నై కి 600 కిలోమీటర్లు సైక్లింగ్ ద్వారా చేరుకుంది అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మక తప్పదు, ఎందుకంటే నిజంగానే అది జరిగింది కాబట్టి. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) అత్త గారు శోభన కామినేని(Shobana Kamineni) (ఉపాసన తల్లి) విషయం లో జరిగింది. 2020 వ సంవత్సరం లో ఆమె ఈ సాహస యాత్ర పూర్తి చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. శోభన కామినేని గారి మోకాళ్ళకు సర్జరీ జరిగింది. ఆమె మెడలో ప్లేట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆమె సహస యాత్ర పూర్తి చేసిందంటే ఆమె దృఢ సంకల్పం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
గొప్పవాళ్ళు ఊరికే అవ్వరు, ఇలాంటి కృషి, పట్టుదల ఉంటేనే అవుతారు అనడానికి మరో బెస్ట్ ఉదాహరణ శోభన కామినేని. నేడు వీళ్లంతా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారంటే అందుకు కారణం వాళ్ళు ఈ స్థాయిలో కష్టపడుతున్నారు కాబట్టే. యువత వీళ్ళను చూసి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. శోభన కామినేని ఈ సాహసోపేత ప్రయాణం ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే, వయస్సు తో సంబంధం లేకుండా ఫిట్నెస్ ని మైంటైన్ చేయొచ్చు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమి కావాలి చెప్పండి?. శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కుమార్తె. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కీలక బాధ్యత ని నిర్వహిస్తున్నారు.
అపోలో హాస్పిటల్స్ కి సంబంధించి ఫార్మసీ, అపోలో హెల్త్ కో లిమిటెడ్ వంటి అపోలో గ్రూప్స్ వ్యవహారాలను తన కూతురు ఉపాసన కామినేని తో పోటీ పడి మరీ నిర్వహిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ లో అత్యుత్తమ సేవలు అందించినది 24/7 డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫార్మ్. ఈ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు అవ్వడానికి ప్రధాన కారణం శోభన కామినేని. ఇప్పటికీ ఆమె ఈ వ్యవహారాలను దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటుంది. ఈ వయస్సు లో ఇంత పెద్ద బాధ్యత మోయడం అంటే సాధారణమైన విషయం కాదు. శోభన గారిలో ఇలా నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆమె నుండి వచ్చిన గొప్ప అలవాట్ల కారణంగా ఉపాసన కామినేని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ ని సమర్థవతంగా నిర్వహిస్తూ ఆదర్శ మహిళగా నిల్చింది. కేవలం ఉపాసన మాత్రమే కాదు,తన కుటుంబం లో ప్రతీ ఒక్కరిని ఇదే స్థాయి ప్రయోజికులను చేసింది శోభన కామినేని.