Dhanush: కరోనా సమయంలో ఓటీటీలే థియేటర్లుగా మారాయని చెప్పాలి. సరదాగా బయటకు తిరిగి గడప లేని సమయంలో ఓటీటీలోనే కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలను తిలకించారు. తెలుగు హీరోలు ఓటీటీ పై దృష్టి పెట్ట లేదనే చెప్పాలి. తమిళ స్టార్ మాత్రం ఓటీటీలో సినిమాలను విడుదల చేశారు. ఓటిటి లో విడుదల చేసిన సూర్య ” ఆకాశమే నీ హద్దురా చిత్రం” మంచి విజయంగా నిలిచింది. విజయ్, సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలు సైతం ఓటిటి లో చిత్రాన్ని విడుదల చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా సూర్య కి దొరికిన అదృష్టం హీరో ధనుష్ కి దక్కలేదనే చెప్పుకోవాలి.
ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ కూడా ఇటీవలే ఓటీటీలోనే రిలీజయ్యింది. ఈ చిత్రం థియేటర్స్‌లో వర్కవుటవదని అనుకున్నారేమో నిర్మాతలు. ఎగ్జిబిటర్లు మాత్రం గొడవ చేశారు స్టార్ హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని… కానీ ఈ చిత్రం ప్లాప్ అవడంతో థియేటర్స్‌లో విడుదల చేయకపోవడమే బెటర్ అని అనుకున్నారంతా. ధనుష్ మళ్లీ ఓటీటీ బాట పట్టడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.
ఇటీవలే డిస్నీ హాట్‌స్టార్ ధనుష్ నటించిన “మారన్” చిత్రానికి మంచి ధర చెల్లించి కొనుక్కుంది. ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. హింసను ఇష్టపడని హీరోకి అన్యాయం జరుగుతుంది. ఎలా రియాక్టయ్యాడు, హింసే తగిన మార్గమని ఎలా ఎంచుకున్నాడు అనేది సినిమా కథ. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు తో ప్రేక్షకులలో అంచనాలను పెంచారు. అయితే ఈ చిత్రాన్ని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అనేది మాత్రం అభిమానులకు అర్థం కావట్లేదు. థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ధనుష్ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు .