https://oktelugu.com/

Ravi Teja: యాక్షన్ సీక్వెన్స్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్న ” రామారావు ఆన్ డ్యూటీ ” టీమ్ …

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో  దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన క్రాక్ రవితేజకు సూపర్ హిట్ ఇవ్వగా…  ప్రస్తుతం పలు సినిమాల షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. వరుసగా మూడు చిత్రాలలో నటిస్తూ యంగ్ హీరోలకు ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో  మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 07:41 PM IST
    Follow us on

    Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో  దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన క్రాక్ రవితేజకు సూపర్ హిట్ ఇవ్వగా…  ప్రస్తుతం పలు సినిమాల షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. వరుసగా మూడు చిత్రాలలో నటిస్తూ యంగ్ హీరోలకు ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో  మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వచ్చే ఈ ఫైట్ సీన్ … సినిమాకే హైలైట్ గా ఉంటుందట. కథకి చాలా కీలకమైన ఈ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. విశేషం ఏమిటంటే ఈ చిత్రం షూటింగ్ మొదలైన రోజు నుండి ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ నడుస్తోంది.

    భద్ర, విక్రమార్కుడు, క్రాక్  చిత్రాల రేంజ్ లో ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని మూవీ యూనిట్ గట్టిగా నమ్ముతున్నారంట.  ప్రస్తుతం మాస్ మహారాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ” ఖిలాడి ” లో నటిస్తున్నారు. ఈ  చిత్రానికి దేవిశ్రీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలానే మరోవైపు  త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ” ధమాకా”  మూవీ షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొంటున్నారు. త్వరలోనే  ఖిలాడి ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తుంది. ఈ వార్తతో రవితేజ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.