Kubera Movie Postponed: ‘లవ్ స్టోరీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల(Shekar Kammula) కొంత గ్యాప్ తీసుకొని ధనుష్(Dhanush K Raja) తో ‘కుబేర'(Kubera Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. రష్మిక(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమాలంటే మొదటి నుండి ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సినిమాలు బాగా ఆలస్యంగా తీస్తాడు అనే చెడ్డ పేరు ఉంది కానీ, తీసే సినిమా కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టే విధంగానే ఉంటుంది. కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అలాంటి డైరెక్టర్ ధనుష్, నాగార్జున లతో సినిమా చేస్తున్నాడంటే ఇండస్ట్రీ వర్గాల్లో హైప్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఆ హైప్ కి తగ్గట్టే ఈ సినిమాని శేఖర్ కమ్ముల తీర్చి దిద్దినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 20 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ చిత్రాన్ని జులై 10 వ తేదికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. జూన్ 12 న పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘కుబేర’ చిత్రం నిజంగా వాయిదా పడి ఉంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి రెండవ వారం కూడా ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. టాక్ వస్తే బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే అనుకోవచ్చు. అయితే ఈ సినిమా వాయిదా పడిందా లేదా అనే విషయం మాత్రం అధికారికంగా ఖరారు కాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన పీఆర్ టీం మాత్రం వాయిదా పడలేదు అనే అంటుంది.
కానీ ఇలా చెప్పిన సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ‘కుబేర’ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని నెటిజెన్స్ అంటున్నారు. జూన్ 20 న సినిమా నిజంగా విడుదల ఉండుంటే ఈపాటికి మొదటి లిరికల్ వీడియో సాంగ్ అయినా విడుదల అయ్యుండేది. అంతే కాకుండా చిన్నగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభించేవారు. ప్రస్తుతానికి అయితే మూవీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు. ఇలాంటి సందర్భం లో ఈ సినిమా జూన్ 20 న వస్తుందంటే డౌటే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ధనుష్ కి ఇది రెండవ తెలుగు సినిమా. మొదటి చిత్రం సార్ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ధనుష్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరో పక్క అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు.