Oceans: మనుషులు, జంతువుల మధ్య మాత్రమే కాదు.. సముద్రాల మధ్య కూడా వైరం ఉంటుంది. అదేంటి నీటికి ప్రవహించడం మాత్రమే తెలుసు.. ఎత్తు నుంచి పల్లం వరకు వెళ్లడం మాత్రమే తెలుసు.. అలాంటి నీటికి వైరం కూడా ఉంటుందా? అనే ప్రశ్నలు మీలో సాధారణంగా కలుగుతూనే ఉంటాయి. కాకపోతే నదుల వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు. నదులు కలసి ప్రవహిస్తుంటాయి. చిన్నచిన్న కాలువలు వాగుల్లో కలుస్తాయి. వాగులు ఉపనదులలో తమ ప్రవాహాన్ని మళ్లిస్తాయి. ఉపనదులు నదుల ప్రవాహ స్థాయిని పెంచుతాయి. ఆ నదులు కాస్త సముద్రాలలో కలుస్తాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.. అయితే సముద్రాలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రవహించవు. దీనిని నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం ఒకే చోట ప్రవహిస్తున్న ప్రాంతంలో.. రెండు పరీక్ష నాళికలలో ఓ వ్యక్తి నీటిని తీసుకున్నాడు. వాటిని కలపడానికి ప్రయత్నించాడు. పసిఫిక్ మహాసముద్రం నీరు.. అట్లాంటిక్ మహాసముద్రం నీరు కలవలేదు. పైగా పసిఫిక్ మహాసముద్రం నీరు నీలిరంగులో.. అట్లాంటిక్ మహాసముద్రం నీరు ఎరుపు రంగులో కనిపించింది. సాధారణంగా ఈ రెండు మాత్రమే కాదు.. ఈ సృష్టిలో ఉన్న ఏ రెండు మహాసముద్రాలు కూడా కలిసి ప్రవహించవు. పైగా వాటి మధ్య ఒక విభజన రేఖా అంటూ ఉంటుంది.. దీనికి కారణం ఏంటంటే..
మహాసముద్రాలలో నీరు లవణీయతను కలిగి ఉంటుంది. ప్రవాహాల వేగం కూడా వేరే విధంగా ఉంటుంది. ఇవి నీటి అవక్షేపణాన్ని భిన్న విధాలుగా తీసుకెళ్తుంటాయి. దీనిని సైన్స్ పరిభాషలో హలో క్లైన్ అని పిలుస్తుంటారు. దీనివల్ల ఒక రకమైన అదృశ్య సరిహద్దు రెండు సముద్రాల మధ్య ఉంటుంది. ఆ సరిహద్దు రెండు మహాసముద్రాలు కలవడానికి నిరోధిస్తుంది. ఆ సముద్రాలు దూరం నుంచి చూస్తే కలిసిపోయినట్టు కనిపిస్తాయి కానీ.. విభజన అనేది ఆ రెండింటిని దూరం చేస్తుంది. ఇక అమెరికాలోని అలస్కా గల్ఫ్ ప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు విభజన రేఖ మధ్య ప్రవహిస్తున్న చోట ఓ వ్యక్తి రెండు పరీక్ష నాళికలలో నీటిని తీసుకున్నాడు. రెండిటిని కలపడానికి ప్రయత్నించగా.. అవి రెండు ఏ మాత్రం కలవలేదు. పైగా రెండు గా వీడిపోయి కనిపించాయి. అయితే మొదట్లో సముద్రాలు ఇలా కలిసిపోకుండా ఉండడాన్ని శాస్త్రవేత్తలు వైరంగా అభివర్ణించేవారు. ఆ తర్వాత అనేక ప్రయోగాల తర్వాత రెండు సముద్రాలు కలవకుండా ప్రవహించడానికి అసలు కారణమిదీ అని నిరూపించారు. అయితే సముద్రాలలో కలిసే నదులు మాత్రం కలిసి ప్రవహించడం విశేషం.