Bhairavam: సినీ ఇండస్ట్రీ లోకి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆచి తూచి మాట్లాడాలి, పొరపాటున ఏ చిన్న తప్పు చేసినా సోషల్ మీడియా లో ఆయా హీరోల అభిమానుల దాటికి తట్టుకోలేరు, ఇండస్ట్రీ ని వదిలి పారిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ‘భైరవం'(Bhairavam) మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడలకు పట్టనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పాపం ముగ్గురు హీరోలు. చాలా కాలం తర్వాత వెండితెర మీద కనిపించబోతున్నారు. ఎలాంటి ఈగోలకు పోకుండా మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas), నారా రోహిత్(Nara Rohit) ఈ చిత్రం లో కలిసి నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది అనే టాక్ కూడా ఉంది. కానీ డైరెక్టర్ విజయ్ నోటి దూల కారణం గా ఇప్పటికే వైసీపీ ఫ్యాన్స్ కి దొరికిపోయాడు. వాళ్ళు ఇతను బయట కనిపిస్తే కొట్టేసేలా ఉన్నారు మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన వైసీపీ ని ఉద్దేశించి కామెంట్స్ చేసాడు.
భైరవం ట్రైలర్ లోని డైలాగ్ ని గుర్తు చేస్తూ ‘ధర్మం కోసం దేవుడు ఎదో ఒక రూపం లో వస్తుంటాడు..గత ఏడాది ఎన్నికల సమయం లో అదే జరిగింది’ అంటూ కామెంట్ చేసాడు. దీనికి వైసీపీ అభిమానులు ట్రిగ్గర్ అయ్యారు. గత మూడు రోజుల నుండి ‘బాయ్ కాట్ భైరవం’ ట్రెండ్ ని సోషల్ మీడియా లో చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా విజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే 2011 వ సంవత్సరం లో ఫేస్ బుక్ లో విజయ్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న మార్ఫింగ్ ఫోటో ని అప్లోడ్ చేసి మెగా ఫ్యామిలీ ని ఎగతాళి చేసాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ బయటపడింది. దీంతో నువ్వు ఇలాంటోడివా అని మెగా ఫ్యాన్స్ విజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వెంటనే క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసాడు. అభిమానుల దెబ్బకు డైరెక్టర్ దిగొచ్చాడు. వెంటనే ట్విట్టర్ లో స్పందిస్తూ ‘మెగా అభిమానులకు గుడ్ ఈవెనింగ్..మెగా ఫ్యాన్స్ భైరవం చిత్రం ని బాయ్ కాట్ చేస్తామంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కారణం ఫేస్ బుక్ లో నా అకౌంట్ నుండి ఎప్పుడో 2011 వ సంవత్సరం లో చిరంజీవి, రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక మార్ఫింగ్ ఫోటో పడింది. అది నిజానికి నేను వెయ్యలేదు. అప్పట్లో నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయినప్పటికీ నా అకౌంట్ నుండి పడింది కాబట్టి బాధ్యత తీసుకొని క్షమాపణలు చెప్తున్నాను. నేను కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్ల సినిమాలను చూసే ఇండస్ట్రీ కి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ కి నేను పని చేసాను. ఆయనే నన్ను సాయి ధరమ్ తేజ్ కి పరిచయం చేసి ఇతనితో సినిమాలు చేసుకో అన్నాడు. నన్ను అంత ప్రోత్సహించిన మనుషులపై నేనెలా విషం కక్కుతాను?’ అంటూ ఆయన కామెంట్స్ చేసాడు.