https://oktelugu.com/

Dhanush: రెండో పెళ్లికి రెడీ అయిన ధనుష్…అమ్మాయి ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..?

Dhanush: ప్రస్తుత ఆయన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరెక్షన్ లో ' కుబేర'(Kubera) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం మరోసారి మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 29, 2024 12:51 pm
    Dhanush is ready for his second marriage

    Dhanush is ready for his second marriage

    Follow us on

    Dhanush: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది సీనియర్ నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ధనుష్ మాత్రం తన ఎంటైర్ కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలను చేస్తూ మంచి ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసిన పాత్రల ద్వారా నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నాడు. ఇక ముందు కూడా చాలా వైవిధ్యమైన పాత్రలతో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుత ఆయన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరెక్షన్ లో ‘ కుబేర'(Kubera) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం మరోసారి మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ధనుష్ పర్సనల్ విషయానికొస్తే ఆయన రజనీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలు గా వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలతో 2022వ సంవత్సరం నుంచి వీళ్ళు విడివిడిగా ఉంటున్నారు. దాంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. ఇక ఇద్దరి తరపున బంధువులు వీళ్ళను ఎంతగా ఒప్పించాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమి సఫలం కాలేదు.

    Also Read: Pushpa 2 Sooseki Song: పుష్ప 2 సెకండ్ సింగిల్ ‘సూసేకి’ రివ్యూ : పార్ట్ 1 సామి సామి ఫ్లేవర్ మిస్!

    దాంతో ఫైనల్ గా డివోర్స్ తీసుకున్న వీళ్ళు ఎవరికి వారు బతుకుతున్నారు. ఇక ఇప్పుడు ధనుష్ తన సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ కి చెందిన ఐశ్వర్యను పెళ్లి చేసుకొని డివోర్స్ దాకా వచ్చాడు.

    Also Read: Box Office Fight: చిన్న హీరోల బాక్సాఫీస్ ఫైట్… ఆ ముగ్గురిలో విన్నర్ ఎవరు?

    కాబట్టి ఇప్పుడు సినిమా ఫీల్డ్ తో సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే తమ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్లతో లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం ధనుష్ తన ఫోకస్ మొత్తం సినిమాలా మీదనే పెట్టినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…