Shreyas Iyer: చివరికి బాత్రూం వెళ్లేటప్పుడు కూడా దాన్ని తీసుకెళ్తున్నాడు.. శ్రేయాస్ అయ్యర్ కు ఇదేం బుద్ధి?

ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంతో కోల్ కతా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..కప్ సాధించిన అనంతరం షారుక్ ఖాన్, చంద్రకాంత్ పండిట్, గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో కోల్ కతా ఆటగాళ్లు చిల్ అయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 12:40 pm

Shreyas Iyer

Follow us on

Shreyas Iyer: ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్ కతా జట్టు ఆవిర్భవించింది.. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సునీల్ నరైన్ వంటి బౌలర్లు విజృంభించడంతో సన్ రైజర్స్ బెంబేలెత్తిపోయింది. 113 పరుగులకే కుప్ప కూలింది. ఈ విజయ లక్ష్యాన్ని కోల్ కతా జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఛేదించింది. ఈ గెలుపుతో కోల్ కతా జట్టు మూడోసారి విజేతగా ఆవిర్భవించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కప్ ను సగర్వంగా పైకి ఎత్తింది..

ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంతో కోల్ కతా జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..కప్ సాధించిన అనంతరం షారుక్ ఖాన్, చంద్రకాంత్ పండిట్, గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో కోల్ కతా ఆటగాళ్లు చిల్ అయ్యారు. ఇప్పటికి రోజుకో తీరుగా సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి. ఈ తరుణంలో శ్రేయస్ అయ్యర్ చేస్తున్న ఒక పని మాత్రం చర్చకు దారితీస్తోంది..

అప్పట్లో హచ్ యాడ్ లో.. ఓ బాలుడిని కుక్క ఫాలో అయ్యేది.. దానికి హచ్ కంపెనీ వేరెవర్ యు గో.. అవర్ నెట్వర్క్ ఫాలోస్ యు.. అనే క్యాప్షన్ జత చేసేది. అదే తీరుగా ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్ తన వెంట ట్రోఫీని తీసుకెళ్తున్నాడు. పడుకుంటున్నప్పుడు పక్కనే పెట్టుకుంటున్నాడు. స్నానం చేస్తున్నప్పుడు దానిని ఎదురుగా ఉంచుకుంటున్నాడు. చివరికి బాత్ రూమ్ వెళ్ళినప్పుడు కూడా పట్టుకుని తీసుకు వెళ్తున్నాడు. ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో అయ్యర్ పంచుకున్నాడు. దానికి taking you everywhere I go అనే క్యాప్షన్ జత చేశాడు.