https://oktelugu.com/

Dhanush – Aishwarya : విడాకులు రద్దు చేసుకోనున్న ధనుష్, ఐశ్వర్య..? ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారుగా!

వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసారు. వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. దాదాపుగా 2 దశాబ్దాలు దాంపత్య జీవితం కొనసాగించి విడాకులు తీసుకోవాలని వీళ్లకు ఎలా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తిన చర్చలు జరిపారు

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:33 PM IST

    Dhanush - Aishwarya

    Follow us on

    Dhanush – Aishwarya : ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ, క్రేజ్ సంపాదించున్న జంటలలో ఒకటి ధనుష్, ఐశ్వర్య జంట. వీళ్లిద్దరి ప్రేమాయణం 2003 వ సంవత్సరం లో మొదలైంది. అప్పట్లో ధనుష్ హీరోగా ‘కాదల్ కొందేన్’ అనే చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని థియేటర్ లో చూసిన ఐశ్వర్య ధనుష్ పై మనసు పడింది. ఈ సినిమాని చూసిన మరుసటి రోజే రోజాపూలతో ధనుష్ కి ఒక బొకేని పంపి శుభాకాంక్షలు తెలియచేసింది. అలా మొదలైన వీళ్లిద్దరి మధ్య పరిచయం, కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ధనుష్ ని ప్రేమిస్తున్న విషయం తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ కి తెలియచేయగా, ఆయన సంతోషం గా వీళ్లిద్దరి పెళ్లిని 2004 వ సంవత్సరం, నవంబర్ 14 వ తేదీన జరిపించాడు. అలా మొదలైన వీళ్లిద్దరి దాంపత్య జీవితం 2022 వ సంవత్సరం వరకు సజావుగా సాగింది.

    కానీ ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసారు. వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. దాదాపుగా 2 దశాబ్దాలు దాంపత్య జీవితం కొనసాగించి విడాకులు తీసుకోవాలని వీళ్లకు ఎలా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తిన చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరు మళ్ళీ కలిసిపోయే ఆలోచనలో ఉన్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ఈమధ్య బాగా ప్రచారం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వీళ్లిద్దరి విడాకుల కేసు కి సంబంధించిన పిటీషన్ కి నోటీసులు ఏప్రిల్ లోనే అందించింది హై కోర్టు. అక్టోబర్ 7 వ తారీఖున ధనుష్, ఐశ్వర్య విచారణకు కోర్టుకి హాజరు కావాలి. కానీ వీళ్లిద్దరు కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ కేసు అక్టోబర్ 19 వ తేదికి వాయిదా పడింది. వీళ్లిద్దరు అలా కోర్టు విచారణకు డుమ్మా కొట్టడానికి పలు కారణాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ వీళ్ళిద్దరినీ మళ్ళీ కలిపెందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

    ఇద్దరి మధ్య వచ్చిన సమస్య విడాకులు తీసుకునేంత పెద్దది కాదు, దయచేసి సర్థుకుపోండి అంటూ సూచించాడట. అప్పటి నుండి ఇద్దరు ఆలోచనలో పడ్డారని, అందుకే వీళ్ళు అక్టోబర్ 7 న కోర్టుకు హాజరు కాలేదని అంటున్నారు. మరి వీళ్ళు రజినీకాంత్ మాటలకు గౌరవం ఇచ్చి కలిసిపోతారా, లేదా ఎవరి దారి వారిదే అని విడిపోతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే, రీసెంట్ గానే ఈయన రాయన్ అనే చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వచించాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుభేరా’ అనే చిత్రం చేస్తున్నాడు, ఇందులో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.