https://oktelugu.com/

Shree Gopika : నిశ్చితార్థం ఒకరితో..పెళ్లి మరొకరితో..వివాదాస్పదంగా మారిన యంగ్ హీరోయిన్ వివాహం!

పెళ్ళికి ముందు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ తో నిశ్చితార్థం చేసుకుంది. జూన్ నెలలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో, ఏమో తెలియదు కానీ ఈ తక్కువ గ్యాప్ లోనే వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:28 PM IST

    Sree Gopika

    Follow us on

    Shree Gopika : ఈమధ్య కాలం లో సినీ సెలెబ్రెటీలకు పెళ్లి అంటే ఒక తమాషా అయిపోయింది. నిశ్చితార్ధ సంప్రదాయాలు అంటే వాళ్లకు లెక్క లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడుతారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో, ఎన్ని రోజుల్లో విడిపోతారో అన్నట్టుగా తయారైంది వీళ్ళ పరిస్థితి. రీసెంట్ గా ఒక మలయాళం హీరోయిన్ నిశ్చితార్థం ఒకరితో చేసుకొని, పెళ్లి మరొకరితో చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మలయాళం లో బుల్లితెర సీరియల్ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ గోపిక రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. పెళ్లి కొడుకు పేరు వరుణ్ దేవ్. వీళ్లిద్దరు కలిసి ‘గురువాయూర్’ సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.

    ఈ పెళ్ళికి ముందు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ తో నిశ్చితార్థం చేసుకుంది. జూన్ నెలలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో, ఏమో తెలియదు కానీ ఈ తక్కువ గ్యాప్ లోనే వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. తన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన గురించి ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకునే ఈమె, జూన్ నెలలో వైశాఖ్ తో జరిగిన నిశ్చితార్ధ ఫోటోలను కూడా అప్లోడ్ చేసింది. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో అప్లోడ్ చేసిన ఫొటోలన్నీ ఇంస్టాగ్రామ్ నుండి తొలగించేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన. జూన్ కి అక్టోబర్ కి మధ్య కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు నెలల్లో వీళ్లిద్దరి మధ్య నిశ్చితార్థం ని రద్దు చేసుకునేంత గొడవలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. నిశ్చితార్థం రద్దు విషయాన్ని పక్కన పెడితే వేరే అబ్బాయితో పెళ్లి ఎలా ఇంతలోపే కుదరించుకుంది అనేది అంతు చిక్కని ప్రశ్న గా మిగిలిపోయింది.

    దీంతో ఇంస్టాగ్రామ్ లో ఆమె లేటెస్ట్ పెళ్లి ఫోటోల క్రింద , నిశ్చితార్థం ఒకరితో, పెళ్లి మరొకరితో, ఇదేమి సంప్రదాయామో?, సెలబ్రిటీ స్థానాల్లో ఉన్నవాళ్లు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ, చెడగొట్టేలా కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీ గోపిక మలయాళం లోనే కాదు, తెలుగు లో కూడా పలు సినిమాలు చేసింది. ప్రముఖ యంగ్ హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ చిత్రంలో శ్రీ గోపిక ఒక కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఈమె తమిళం లో ‘రూల్ నెంబర్ 4’, ‘వోల్ఫ్’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు సీరియల్స్ లో వచ్చినంత గుర్తింపు సినిమాల్లో రాకపోవడం గమనార్హం. వాస్తవానికి ఈమె నటించిన సినిమాలన్నీ ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు, అందుకే మళ్ళీ సీరియల్స్ చేసుకుంటూ బుల్లితెర రంగంలో బిజీ గా గడుపుతుంది.