https://oktelugu.com/

Tumbad : అక్షరాలా 10 లక్షల టిక్కెట్లు..రీ రిలీజ్ హిస్టరీ లోనే ‘తుంబాద్’ ఆల్ టైం రికార్డు..వసూళ్లు ఎంత వచ్చాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఎవ్వరూ ఊహించని విధంగా 'తుంబాద్' అనే చిన్న సినిమా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయట.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:44 PM IST

    Tumbad

    Follow us on

    Tumbad : రీ రిలీజ్ సినిమాల హవా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని రీ రిలీజ్ సినిమాలు అయితే కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసేశాయి. తెలుగు లో ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలలో కేవలం ‘గబ్బర్ సింగ్’, ‘మురారి’ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాల క్లోసింగ్ వసూళ్లు 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల లోపే ఉన్నాయి. కానీ తమిళం లో విజయ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘గిల్లీ’ చిత్రం వరల్డ్ వైడ్ గా 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇదే ఇప్పటి వరకు ఇండియా లో ఆల్ టైం రికార్డు గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రం. ఈ రికార్డు ని మళ్ళీ విజయ్ ఫ్యాన్స్ కానీ, లేదా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ బద్దలు కొడుతారని అందరూ అనుకున్నారు.

    కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ‘తుంబాద్’ అనే చిన్న సినిమా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటి వరకు రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక టిక్కెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయిన చిత్రం ‘గిల్లీ’. నాలుగు లక్షలకు పైగా టిక్కెట్లు ఈ సినిమాకి అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మురారి చిత్రానికి 2 లక్షల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి 2 లక్షల 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. విచిత్రం ఏమిటంటే తుంబాద్ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మధ్యలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదలైంది, కానీ ఆ సినిమా వసూళ్ల ప్రభావం దీనిపై ఏమాత్రం కూడా పడలేదు.

    అలాగే మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టియాన్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. అయినప్పటికీ కూడా ఈ సినిమా కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రీ రిలీజ్ లో ఇప్పటి వరకు 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మొదటి సారి విడుదలైనప్పుడు కేవలం 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓటీటీ లో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ హారర్ చిత్రాన్ని థియేట్రికల్ అనుభూతి పొందడం కోసం ఆడియన్స్ ఈ స్థాయిలో ఎగబడ్డారు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ని చూసిన తర్వాత మరికొన్ని హారర్ చిత్రాలను థియేటర్స్ లో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ‘అరుంధతి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట, ఈ హారర్ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.