Homeఎంటర్టైన్మెంట్Devi Sri Prasad: నిన్న సుకుమార్..ఇప్పుడు హరీష్ శంకర్...దేవి శ్రీ ప్రసాద్ పరువు తీస్తున్నారుగా...

Devi Sri Prasad: నిన్న సుకుమార్..ఇప్పుడు హరీష్ శంకర్…దేవి శ్రీ ప్రసాద్ పరువు తీస్తున్నారుగా…

Devi Sri Prasad: ఒక సినిమా సక్సెస్ వెనుక 24 క్రాఫ్ట్స్ ఆధారపడి ఉంటాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా దర్శకుడు వాళ్ళందరి నుంచి తనకు కావలసిన ఔట్ పుట్ ను రాబట్టుకుంటాడు. కాబట్టి తనని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు… ఒక సినిమా సక్సెస్ లో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం తో పాటు మ్యూజిక్ కూడా కీలకపాత్ర వహిస్తుంది. కొన్ని సినిమాలైతే సాంగ్స్ అద్భుతంగా ఉండడం వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయిన కూడా ఆ సినిమాకి మినిమం కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి కూడా మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా విలుగొందుతున్న దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సైతం మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం విశేషం…ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ ను పక్కనపెట్టి తమన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!

దీనికి కారణం ఏంటి అంటే దేవిశ్రీప్రసాద్ అనుకున్నట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోతున్నాడు అంటున్నారు. ఇక గతంలో సుకుమార్ సైతం పుష్ప 2 సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ను పక్కన పెట్టి శ్యాంసిఎస్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చేసే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారా? దేవిశ్రీప్రసాద్ విషయంలోనే ఎందుకిలా చేస్తున్నారు.

నిజంగా దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ అంత బాగా ఇవ్వలేడా అంటూ చాలామంది అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ పరువు పోయేలా చేస్తున్నారు అంటూ అటు సుకుమార్ మీద, ఇటు హరీష్ శంకర్ మీద చాలా మంది ఫైర్ అవుతున్నారు…

ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి అనే విషయాన్ని మర్చిపోతున్నారు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక ఇదేమైనా కూడా దేవి మరోసారి తన సత్తా చూపిస్తే తప్ప ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశమైతే లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular