Devara2 Teaser : గత ఏడాది ఎన్టీఆర్(Junior NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవర'(Devara Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, రోజులు గడిచే కొద్దీ టాక్ మారుతూ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వడం తో, ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ చూడని లాంగ్ రన్ ని చూసింది ఈ చిత్రం. సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా దాదాపుగా 9 వారాల పాటు ట్రెండ్ అయ్యింది. టీవీ టెలికాస్ట్ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకున్న ‘హిట్ 3’..వసూళ్లు ఎంత వచ్చాయంటే!
అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 ఉంటుందని ఒక క్లిఫ్ హ్యాంగర్ వదిలిన సంగతి అందరికీ తెలిసిందే. కన్నకొడుకు దేవర ని ఎందుకు చంపాడు అనేది పార్ట్ 2 లో చూపించబోతున్నట్టు క్లిఫ్ హ్యాంగర్ లో డైరెక్టర్ కొరటాల శివ చూపించాడు. ఇది బాహుబలి క్లిఫ్ హ్యాంగర్ కి స్పూఫ్ గా ఉందంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ అప్పట్లో ఒక రేంజ్ లో వచ్చాయి. ఎదో చూపించాలి కాబట్టి పార్ట్ 2 ఉన్నట్టు చూపించారు కానీ, అసలు ‘దేవర 2′(Devara 2 Movie) ఎప్పటికీ రాదని, అంత కంటెంట్ సినిమాలో లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకునేవారు. కానీ పార్ట్ 2 ఉందని ఎన్టీఆర్ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో అధికారికంగా తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాని, ఈ సినిమా పూర్తి అవ్వగానే ‘దేవర 2’ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఆలోచిద్దాంలే అని ఎన్టీఆర్ అభిమానులు కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ ‘దేవర 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయింది. ఇందుకోసం ఒక స్పెషల్ వీడియో ని కూడా త్వరలో తయారు చేయబోతున్నారట. ఈ స్పెషల్ వీడియో ద్వారా ‘దేవర 2’ మొదలు అవుతుందని ఒక ప్రకటన చేస్తారట. అది ఈ నెలలోనే ఉండబోతుందని టాక్. ఈ నెల 20 వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ రోజున ఈ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట మేకర్స్. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఇది వర్కౌట్ అయ్యే సినిమా కాదని, మొదటి భాగం కేవలం ఎన్టీఆర్ వల్ల, అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మాత్రమే ఆడిందని అంటున్నారు.
ఈ నెలలో దేవర 2 అనౌన్స్ మెంట్ విడియో…
మరో పన్నెండు.. పదమూడు రోజుల్లో వుండొచ్చు. https://t.co/RYAArt1Tu7
— devipriya (@sairaaj44) May 7, 2025