Operation Sindhoor : లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) అనే హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుంది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం గా మన ఇండియన్ ఆర్మీ అర్థ రాత్రి సమయం లో 9 ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి కి వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, చనిపోయిన అమాయకులకు 12 రోజుల్లో అద్భుతమైన నివాళి మన ఇండియన్ ఆర్మీ ఇచ్చిందని రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు భారత ప్రభుత్వాన్ని, ఇండియన్ ఆర్మీ ని, నరేంద్ర మోడీని మెచ్చుకుంటున్నారు. పెహల్గామ్ దాడి లో తమ భర్తలను కోల్పోయిన మహిళలు కూడా భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోపక్క మన టాలీవుడ్ సెలబ్రిటీల నుండి కూడా భారత ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
Also Read : ఆపరేషన్ సింధూర్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ..
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వాన్ని, ఇండియన్ ఆర్మీ ని పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు మా శాంతి స్వరూపాన్ని అడ్డం పెట్టుకొని ముష్కరాలు చేసిన నీచమైన చర్యలు ఇదే సరైన సమాధానం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా చివరి ఉగ్రవాది మిగిలే వరకు ఈ ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు. ఇక మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ‘ఆపరేషన్ సింధూర్’ పై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సింధూర్ అంటే కేవలం తిలకం మాత్రమే కాదు, మా సంకల్పానికి ప్రతీక..జైహింద్’ అంటూ ఆయన వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మాట్లాడుతూ ‘న్యాయం జరిగింది..మేరా భారత్ మహాన్..జైహింద్’ అంటూ ఒక ట్వీట్ వేశాడు.
అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), కళ్యాణ్ రామ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తదితరులు ‘ఆపరేషన్ సింధూర్’ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అర్థ రాత్రే ‘జైహింద్’ అంటూ ట్వీట్ వేశాడు. ఇలా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సెలబ్రిటీలు ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విశేషం ఏమిటంటే మోడీ పేరు తీస్తేనే చిరాకు పడే వాళ్ళు కూడా నేడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారంటే, ఈ ‘ఆపరేషన్ సింధూర్’ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్థాన్ సిటిజన్స్ పై ఈగ కూడా వాలకుండా, వాళ్ళ సైన్యం పై రవ్వంత దాడి కూడా చేయకుండా, కేవలం ముష్కరుల స్థావరాలనే టార్గెట్ చేసుకొని దాడి చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు బాల్ పాకిస్థాన్ కోర్టు లో ఉంది. పొరపాటున వాళ్ళు మన మీద దాడి చేస్తే, ‘ఆపరేషన్ సింధూర్ 2’ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.