Hari Hara Veera Mallu : సుమారుగా ఐదేళ్ల నుండి సెట్స్ మీద ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నేటితో పూర్తి అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి తుది మెరుగులు దిద్ది, సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. అయితే మే30 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలా?, లేకపోతే జూన్ 12 న విడుదల చేయాలా? అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కచ్చితంగా ఈ రెండు తేదీలలో ఎదో ఒక తేదీన విడుదల అవుతుంది అనేది మాత్రం స్పష్టమైంది. అయితే ఈ రెండిట్లో ఏ తేదీన విడుదల చేయాలి అనేది అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం మే నెలలో ఎట్టి పరిస్థితిలోనూ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయాలి. లేకపోతే అమెజాన్ ప్రైమ్ డీల్ రద్దు అవుతుంది అని గత నెలలో హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : దేవర 2′ టీజర్ విడుదల తేదికి ముహూర్తం ఫిక్స్..ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్!
ఈ అంశం పై చర్చించేందుకు నిర్మాత AM రత్నం రేపు ముంబై కి వెళ్లబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఒప్పుకుంటే ఈ చిత్రం జూన్ 12న విడుదల అవుతుంది. వాళ్ళు ఒప్పుకోకుంటే మే30 న విడుదల అవుతుంది. ఏ విషయం అనేది రేపటి సాయంత్రం లోపు ఒక క్లారిటీ రాబోతుంది. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని మే30 న విడుదల చేయమని నిర్మాతను అడుగుతున్నారు. మరో పక్క ఓవర్సీస్ బయ్యర్స్ మే30 అయితే మేము భారీ విడుదలని ఇవ్వలేమని, జూన్ 12 న విడుదల చేయమని కోరుతున్నారు. నిర్మాత రత్నం కి కూడా జూన్ 12 నే విడుదల చేయాలనీ ఉంది. ఎందుకంటే ఆయనకు ప్రొమోషన్స్ కోసం కనీసం నెల రోజులు కావాలని బయ్యర్స్ తో చెప్పాడట. కానీ బయ్యర్స్ మాత్రం సమ్మర్ చివరి రోజుల్లో వసూళ్లు చాలా భారీగా ఉంటాయని, భారీ రేట్స్ కి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మాకు మే 30న విడుదల కావాలని అడుగుతున్నారు.
మరి ఏమి జరగబోతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరోపక్క పవర్ స్టార్ సినిమా విడుదల తేదీని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్ణయించడం పై ట్రేడ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఓటీటీ డామినేషన్ నడుస్తున్న ఈ రోజుల్లో, ఒక సూపర్ స్టార్ సినిమాని శాసించే స్థాయికి ఓటీటీ సంస్థలు ఎదిగాయా అని సోషల్ మీడియా లో పవన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ సినిమాకు ఇవ్వన్నీ అవకాశాలు అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘హరి హర వీరమల్లు’ సినిమాకు ఇచ్చింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయాలి, కానీ కుదర్లేదు, అమెజాన్ ప్రైమ్ వాళ్ళ రూల్స్ ని కాదని ఈ సినిమాకు మార్చి 28 న విడుదల చేస్తామంటే అంగీకరించింది. మార్చి 28 కూడా మిస్ అయ్యింది, అయినప్పటికీ సహించింది, ఇప్పుడు మే9 కూడా మిస్ అవ్వడం తో, మే నెలలో విడుదల కాకుంటే మేము డీల్ ని రద్దు చేసుకుంటామని హెచ్చరించిం