Devara Movie : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం పై గత ఏడాది అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు మామూలివి కావు. ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అవుతుందేమో అని అందరు అనుకున్నారు. ఎందుకంటే రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ ని ఎదురుకోవాల్సిందే అనే సెంటిమెంట్ ట్రేడ్ లో ఉంది కాబట్టి. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. భారీ రేట్స్ ని పెట్టి కొనుగోలు చేసాము, ఇలాంటి టాక్ వచ్చిందేంటి, ఈ టాక్ తో సినిమా అసలు నిలబడుతుందా అని అభిమానులు భయపడ్డారు. కానీ రెండవ రోజు నుండి టాక్ పుంజుకుంది. మాస్ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చింది.
Also Read : ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం హాలీవుడ్ మాస్టర్ రాబోతునాడా..?
దీంతో భారీ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అనంతరం ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 9 వారాల పాటు నాన్ స్టాప్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యింది ఈ చిత్రం. అలాంటి చిత్రాన్ని మార్చి 28 న జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. #RRR చిత్రం జపాన్ లో సంవత్సరం రోజులు ఆడింది, ఎన్టీఆర్ కి కూడా మొదటి నుండి జపాన్ లో మంచి ఫేమ్ ఉంది కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం అక్కడ వర్కౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. స్వయంగా ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లి ఈ సినిమా ని ఒక రేంజ్ లో ప్రమోట్ చేశాడు. ప్రీమియర్ షోస్ లోని కొన్ని థియేటర్స్ కి వెళ్లి అభిమానులతో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ కూడా వేసాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఇంత చేసినప్పటికీ కూడా ఈ సినిమాకు జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలే ఎదురు అయ్యాయి. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ఇప్పటి వరకు 25 మిలియన్ల జపాన్ డాల్లర్స్ వచ్చాయట.రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రానికి జపాన్ లో 44 మిలియన్ డాలర్లు వచ్చాయి. అంటే దాదాపుగా సగం వసూళ్లను కూడా దేవర చిత్రం రాబట్టలేకపోయిందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇండియా లో సూపర్ హిట్ అయిన సినిమా జపాన్ లో కూడా సూపర్ హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు, కానీ ఆ రేంజ్ లో ప్రొమోషన్స్ చేసిన తర్వాత కూడా వసూళ్లు రాలేదంటే, ‘దేవర’ చిత్రం జపాన్ ఆడియన్స్ కి నచ్చలేదని స్పష్టంగా అర్థం అవుతుంది.
Also Read : పవన్ కళ్యాణ్, అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా?