Tamil Nadu Politics : నిన్న అన్నాడీఎంకే నేత ఈ ఫళని స్వామి ఓ బాంబు పేల్చాడు. నాకు బీజేపీతో ఎన్నికల ఒప్పందం ఉంది. అంతేకానీ సంకీర్ణ ప్రభుత్వ ఒప్పందం లేదు. డీఎంకేను ఓడించడానికి కేవలం బీజేపీ సపోర్టు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో బీజేపీకి భాగస్వామ్యం ఉండదు అని ఫళనిస్వామి ప్లేటు ఫిరాయించాడు.
కానీ అమిత్ షా ఎన్డీఏ కూటమి తమిళనాడులో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాడు.ఎన్డీఏ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఫళనిస్వామి అంటున్నాడు. ప్రభుత్వంలో బీజేపీ పాత్ర లేదని అంటున్నాడు.
ఇది బీజేపీలో గందరగోళానికి దారితీసింది. ఎందుకంటే అన్నాడీఎంకేతో పొత్తు కోసం ఏకంగా బీజేపీని తమిళనాట నిలబెట్టిన అన్నాడీఎంకేను సైతం బీజేపీ పక్కనపెట్టింది. సాఫ్ట్ గా ఉండే బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పెట్టారు. ఈయన వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం లేదు. ఆయన వల్ల అసలు ఓటు బ్యాంకు మారదు.
అన్నాడీఎంకే లో బీజేపీ తో ఒప్పందంపై కూని రాగాలు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
