Mohanlal
Mohanlal: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు మోహన్ లాల్(Mohanlal). మలయాళం లో నాలుగు దశాబ్దాల నుండి నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు ఆయన. నటనలో మోహన్ లాల్ ని కమల్ హాసన్ తో పోలుస్తూ ఉంటారు, అంతటి అద్భుతమైన నటుడు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని పొందాడు. అలాంటి నటుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడితే ఎంతో గర్వంగా ఉంటుంది కదూ. ఈ నెల 27వ తారీఖున ఆయన హీరో గా నటించిన ‘ఎల్2: ఎంపురన్'(L2: Empuran) అనే చిత్రం విడుదల కాబోతుంది. మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన పృథ్వీ రాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘లూసిఫర్’ చిత్రానికి ఇది సీక్వెల్. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు(Dil Raju) కొనుగోలు చేసాడు.
Also Read: ‘ఏం పోయేకాలం అనన్య’.. మూర్తి.. ఏం లాంగ్వేజ్ ఇదీ
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన్ లాల్ తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘తెలుగు చిత్ర పరిశ్రమ మన దేశంలోనే నెంబర్ 1. ఇక్కడి ఆడియన్స్ చూపించే ప్రేమాభిమానాలను వెలకట్టలేము. తెలుగులో ఎంతో మందితో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వర రావు గారితో కలిసి నటించడం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను, నా తీపి జ్ఞాపకాలలో అలాంటివి పదిలంగా ఉంటాయి. గతం లో నేను మలయాళం లో నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి. కానీ ఇప్పుడు నేరుగా ఈ చిత్రం ద్వారా ముందుకు వస్తున్నాము. సుమారుగా ఈ సినిమాకోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాము. పృథ్వీ రాజ్ నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మూడు భాగాలుగా తీస్తున్నామని చెప్పాడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది, ఈ చిత్రం 50 రోజుల వేడుకలో మల్లి కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒకానొక సమయంలో గంటకు లక్షకు పైగా టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. దీనిని బట్టి ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. లూసిఫర్ చిత్రాన్ని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ చిత్రానికి సీక్వెల్ ఇది. మరి తెలుగు లో కూడా ‘గాడ్ ఫాదర్’ కి సీక్వెల్ వస్తుందా లేదా అనేది చూడాలి. అయితే చాలా మంది ఇతర భాషలకు సంబంధించిన హీరోలు, మన తెలుగు లో సినిమాలను రిలీజ్ చేసుకుంటూ, కనీసం ప్రొమోషన్స్ కూడా పాల్గొనడానికి ఇష్టపడరు. కానీ మోహన్ లాల్ ఇంత దూరం వచ్చి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటుండడం నిజంగా హరిషించదగ్గ విషయమే.